జనసేన వైపు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చూపు..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీలో ఎమ్మెల్యేల అభ్యర్దుల ఖరారులో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గెలుపే ప్రామాణికంగా.. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన చోట అభ్యర్దులను మార్పు చేస్తున్నారు. ఇటు టీడీపీ, జనసేన పొత్తులో సీట్ల సర్దుబాటు పై నిర్ణయాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో వైసీపీ ఎమ్మెల్యే సీటు రాకపోవటంతో పార్టీ మార్పు దిశగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కొత్త లెక్కలు : ముఖ్యమంత్రి జగన్ కొత్త లెక్కలతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. టీడీపీ, జనసేన పొత్తుతో ఓటర్ల మూడ్ కు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ రెండు పార్టీల పొత్తు గోదావరి జిల్లాల్లో ప్రభావం ఎక్కవగా ఉండే అవకాశం ఉంది. దీంతో, ఆ రెండు పార్టీలకు భిన్నంగా సామాజిక సమీకరణాలకు జగన్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో సీట్ల మార్పు పైన సిట్టింగ్ ఎమ్మెల్యేలతో నేరుగా చర్చిస్తున్నారు. భవిష్యత్ అవకాశాల పైన హామీ ఇస్తున్నారు. అందులో భాగంగా పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాలని నిర్ణయించారు. పిఠాపురం నుంచి కాకినాడ ప్రస్తుత ఎంపీ వంగా గీతను బరిలోకి దింపటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

YCP MLA Dorababu likely to join in Janasena as CM Decides to change his Candidature for next Elections

దొరబాబు మంత్రాంగం : దీంతో, ఎమ్మెల్యే దొరబాబు తన మద్దతు దారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తనకు వైసీపీ నుంచి సీటు దక్కే అవకాశం లేదని స్పష్టం చేసారు. వారు వద్దనుకున్నప్పుడు మన పని మనం చేసుకుందామని అనుచరులకు చెప్పటం ఆసక్తి కరంగా మారుతోంది. ఇదే సమయంలో ఎన్నికల్లో పోటీ చేయటం ఖాయమని తేల్చి చెబుతున్నారు. ఎన్నికలకు సిద్దం కండి అంటూ తన మద్దతు దారులకు దొరబాబు సూచిస్తున్నారు. దీని ద్వారా మరో పార్టీ నుంచి దొరబాబు పోటీకి సిద్దం అవుతున్నట్లు స్పష్టం అవుతోంది. జనసేన ముఖ్య నేతలతో దొరబాబు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే, పిఠాపుం సీటు కోసం జనసేన, టీడీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఈ రెండు పార్టీల నుంచి పోటీ కొనసాగుతోంది.

YCP MLA Dorababu likely to join in Janasena as CM Decides to change his Candidature for next Elections

జనసేన వైపు చూపు : దొరబాబు 2004లో ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో ప్రజారాజ్యం నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రస్తుత ఎంపీ వంగా గీత తిరిగి వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు. ఇదే సమయంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఆయన ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముద్రగడ లేదా ఆయన కుమారుడు ఎన్నికల్లో పోటీ చేస్తారని చెబుతున్నారు. ఇటు తమ పార్టీ నుంచి ఎవరూ ఇతర పార్టీల్లోకి వెళ్లే అవకాశం లేదని వైసీపీ నాయకత్వం స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా దొరబాబు మంత్రాంగం రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+