వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ ఎమ్మెల్యే గుడ్ బై??

|
Google Oneindia TeluguNews

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్‌నేత‌, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు స‌న్నిహితుడైన శ్రీ‌శైలం ఎమ్మెల్యే శిల్పాచ‌క్ర‌పాణిరెడ్డి రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్ప‌బోతున్నార‌నే వార్త‌లు ఏపీలో జోరుగా న‌డుస్తున్నాయి. రెండోసారి ఏర్పాటైన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు త‌న‌కూ చోటుంటుంద‌ని ఆశించిన శిల్పాకు నిరాశే ఎదురైంది. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనై న శిల్పాచ‌క్ర‌పాణిరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేర‌బోతున్నారనే వార్త‌లు కూడా చ‌క్క‌ర్లు కొట్టాయి.

1అన్నీ ఆలోచించుకొనే..

1అన్నీ ఆలోచించుకొనే..


మంత్రి ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డంతో కొంత‌కాలం మౌనంగా ఉన్న శిల్ప అన్నీ ఆలోచించుకొని త‌న స‌న్నిహితుల‌వ‌ద్ద ఒక విష‌యాన్ని ప్ర‌స్తావించారు. తాను క్రియాశీల రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్నాన‌ని, త‌న‌కు బ‌దులుగా త‌న కుమారుడు కార్తీక్‌రెడ్డి రాబోయే ఎన్నిక‌ల్లో శ్రీశైలం నుంచి పోటీచేస్తార‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది. కార్తీక్‌రెడ్డి కూడా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తూ నాయ‌కులంద‌రినీ క‌లుస్తుండ‌టం కూడా శిల్ప మాట‌ల‌కు ఊతం ఇచ్చిన‌ట్ల‌వుతోంది

నా కుమారుణ్ని ఆశీర్వ‌దించండి

నా కుమారుణ్ని ఆశీర్వ‌దించండి


ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి తాను విర‌మించుకుంటున్నాన‌ని, త‌న‌కు బ‌దులుగా త‌న కుమారుడికి ఆశీస్సుల అందించాల‌ని పార్టీ అధినాయ‌క‌త్వాన్ని శిల్ప కోర‌గా వైసీపీ అధిష్టానం బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేసింది. అయిన‌ప్ప‌టికీ త‌న నిర్ణ‌యాన్ని క‌రాఖండిగా చెప్పిన‌ట్లు వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో ఉన్న‌ప్పుడు ఎమ్మెల్సీగా చంద్రబాబు అవ‌కాశం ఇచ్చార‌ని, మండ‌లి చైర్మ‌న్ ప‌ద‌విని కూడా ఇస్తాన‌న్నార‌ని ఆయ‌న త‌న స‌న్నిహితుల‌వ‌ద్ద చెబుతున్నారు.

అన్నీ వ‌దులుకున్నా ద‌క్కింది శూన్యం

అన్నీ వ‌దులుకున్నా ద‌క్కింది శూన్యం


మండ‌లి చైర్మ‌న్ ప‌ద‌విని వ‌దులుకొని జ‌గ‌న్ వెంట న‌డిచామ‌ని, రెండుసార్లు మంత్రి ప‌ద‌వి కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ ముఖ్య‌మంత్రి నుంచి మొండిచెయ్యే ఎదురైంద‌ని శిల్పాచ‌క్ర‌పాణిరెడ్డి అంత‌ర్గ‌తంగా ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ బాధ‌తోనే ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి విర‌మించాల‌నుకుంటున్నార‌ని, త‌న‌కు బ‌దులుగా త‌న కుమారుణ్ని ప్రోత్స‌హించాల‌ని నియోజ‌క‌వ‌ర్గంలోని నాయ‌కులంద‌రికీ చెబుతున్న‌ట్లు తెలుస్తోంది. జ‌గ‌న్ మాట విని మ‌ళ్లీ శ్రీశైలం నుంచి శిల్ప పోటీచేస్తారా? లేదంటే త‌న కుమారుణ్నినిల‌బెడ‌తారా? అనేదానిపై స్ప‌ష్ట‌త రావాలంటే కొద్దిరోజులు వేచిచూడ‌క త‌ప్ప‌దు.!!

English summary
ycp mla goodbye to direct politics
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X