అర్ధరాత్రి కరకట్టకు వెళ్లి పవన్ ప్యాకేజీలు: చంద్రబాబు కొత్త బినామీ జనసేనాని: ఎమ్మెల్యే ఆర్కే సంచలన
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు కొత్త బినామీ పవన్ అని రోపించారు. చంద్రబాబు ఎన్నో అక్రమాలు చేశాడన్నారు. అర్ధరాత్రి కరకట్టకు వెళ్లి పవన్ ప్యాకేజీలు తీసుకున్నారని ఆరోపణలు గుప్పించారు. పవన్ ప్యాకేజీ తీసుకున్నాడనటానికి నిదర్శనమే.. మంగళగిరిలో జనసేన ఎవరినీ పోటీకి పెట్టకపోవడమని పేర్కొన్నారు. రాజధాని రైతు ల ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా భూ సేకరణ చేస్తే..తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని నాడు పవన్ చెప్పారని..మరి చంద్రబాబు భూ సేకరణ చేస్తే పవన్ ఎందుకు దీక్ష చేయలేదని ప్రశ్నించారు. ఇదే సమయంలో.. కృష్ణా.. గుంటూరు జిల్లా వాళ్లు అన్ని రంగాల్లో ముందున్నారన్నారు. రాయలసీమ.. ఉత్తరాంధ్ర వాళ్లు కూడా అభివృద్ధి చెందాలనేదే తమ లక్ష్యమని ఆళ్ళ వివరించారు.

అర్ద్రరాత్రి కరకట్టకు వెళ్లి పవన్...
జనసేన అధినేత పవన్ అర్ధరాత్రి కరకట్టకు వెళ్లి పవన్ ప్యాకేజీలు తీసుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కొత్త బినామీ అంటూ వ్యాఖ్యానించారు. తాజా ఎన్నికల్లో లోకేశ్ గెలుపు కోసమే పవన్ కళ్యాణ్ జనసేన నుండి ఎవరినీ పోటీకి పెట్టలేదని విమర్శించారు. కమ్యూనిస్టులకు అవకాశం ఇచ్చారని అనుకున్నా.. ఏ ఒక్క రోజు కూడా ఆ అభ్యర్ధి గెలుపు కోసం ప్రచారం చేయలేదన్నారు. అదే విధంగా తాడికొండ నుండి సైతం జనసేన అభ్యర్ధిని దింపకుండా..బీఎస్పీ అభ్యర్దిని పోటీలోకి దింపి చంద్రబాబుకు సహకరించారని ఆర్కే ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజధానిలో బలవంతంగా భూములు సేకరిస్తే ఆమరణ దీక్ష చేస్తానని పవన్ చెప్పారని..మరి అప్పుడు ప్రభుత్వం బలవంతంగా భూ సేకరణ చేస్తే పవన్ ఎందుకు ఆమరణ దీక్ష చేయలేదని పవన్ ప్రశ్నించారు.

ఆధారాలు బయట పెట్టాము..
రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ తో ఆధారాలు బైట పెట్టామన్నారు. తన భార్య పేరుతో రాజధానిలో ఐదు ఎకరాలు భూమి ఉందని మాజీ ఎమ్మెల్యే బోండా అన్నారని.. ఐదు ఎకరాలు భూమి మాకు ఉందని చూపిస్తే ఐదు ఎకరాలు చూపించిన వారికే రాసిస్తానని సవాల్ చేసారు. బహిరంగంగా ప్రజలకు క్షమాపణ చెపుతానన్నారు. నిరూపిస్తే..తాను స్పీకర్ పర్మేట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేసారు.
లక్షల కోట్ల అవినీతి బైట పడుతుందని కులం పేరుతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు రాజధానికి శాపం.. జగన్మోహన్ రెడ్డి రాజధానికి వరం అంటూ వ్యాఖ్యానించారు. చంద్ర బాబు 33 వేల తీసుకొని ఇస్తే గ్రాఫిక్స్ చూపించారని ఎద్దేవా చేసారు. రాజధానిలో అవినీతికి పాల్పడలేదని చంద్రబాబు గుండెలు మీద చెయ్యాసుకొని చెప్పగలరా అని ప్రశ్నించారు. ఐదేళ్లు సీఎం గా ఉండి కేంద్ర ప్రభుత్వం లో భాగస్వామ్యం గా ఉంది ఒక పెర్మినేట్ బిల్డింగ్ కట్టారా అంటూ నిలదీసారు.

చంద్రబాబుకు ధైర్యం ఉంటే విశాఖలో వద్దని చెప్పాలి..
చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని మంగళగిరి తాడికొండలో టీడీపీని లోకేష్ ను ఓడించారని ఆర్కే విశ్లేషించారు. రైతులను బెదిరించి హింసించి కొట్టి రాజధానికి భూముల తీసుకున్నారని..33 వేల ఎకరాల్లో 10 శాతం మంది మాత్రమే చంద్రబాబు నమ్మి భూముల ఇచ్చారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు కు ధైర్యం ఉంటే విశాఖలో రాజధాని వద్దు రాయలసీమ లో హైకోర్టు వద్దని చెప్పాలని డిమాండ్ చేసారు. రైతులు నుంచి అన్యాయంగా భూములు తీసుకున్నప్పుడు భువనేశ్వరి ఎందుకు బైటకు రాలేదని ప్రశ్నించారు. రాజధానిలో ఎన్టీఆర్.. అంబేద్కర్ విగ్రహం ఎందుకు కట్టలేదని లోకేష్ చంద్రబాబు ను అడగాలని సూచించారు. రాజధాని పేరుతో చంద్రబాబు ప్రాంతాలు కులాలు మధ్య చిచ్చు పెడుతున్నారంటూ ఆర్కే ఫైర్ అయ్యారు.












Click it and Unblock the Notifications