వివేకానందరెడ్డిది గుండెపోటు అని అందుకే చెప్పా - విజయసాయిరెడ్డి
ఏపీలో ఎన్నికల సమయంలో కడప మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య మరోసారి తెర మీదకు వచ్చింది. సరిగ్గా గత సార్వత్రిక ఎన్నికల ముందు వివేకానందరెడ్డి హత్య జరిగిందనే విషయం తెలిసిందే. వివేకానందరెడ్డిని కుటుంబ సభ్యులే హత్య చేశారని కామెంట్స్ తెర మీదకు వచ్చాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈ కేసులో భాగస్వామి అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి వివేకానందరెడ్డి కూతురు సునీత, వైఎస్ షర్మిల సైతం కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు.
వివేకానందరెడ్డి హత్యలో ప్రధాన నిందితుడు అవినాష్ రెడ్డే అని..ఆయన్ను సీఎం జగన్ కాపాడుతున్నారంటూ సునీత, వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా వివేకానందరెడ్డి మరణంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన మాట్లాడారు. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని మొదట వెల్లడించింది విజయసాయిరెడ్డే. ఆయన తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు.

వివేకానందరెడ్డి చనిపోయారని నాకు ఆ రోజు ఉదయం ఓ విలేకరి కాల్ చేసి చెప్పారని విజయసాయిరెడ్డి తెలిపారు. దీనిపై నేను పార్టీకి చెందిన వ్యక్తులకు కాల్ చేసి మాట్లాడగా అక్కడున్న వారు వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని చెప్పారని..నేను ఇదే విషయాన్ని మీడియాకు తెలియజేశానని విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. టీడీపీ నాయకులు వివేకానందరెడ్డి హత్యని ఈరకంగా తమ స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు.












Click it and Unblock the Notifications