ఏపీ సేఫ్ హ్యాండ్స్ ఎక్కడా..? సాయి ధరమ్ తేజ్‌పై భారీ ట్రోలింగ్
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనని కొద్దికాలంగా జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నారని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. జాని మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేదింపులకు పాల్పడుతున్నట్లు మహిళా కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేసింది. జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నారంటూ ఆ డాన్సర్ రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేయడంతోపాటు గాయపరిచాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
Johnny master in safe hands 🙏 @IamSaiDharamTej pic.twitter.com/7wkszwmD7v
— YSRCP USA SM (@YSRCPUSASM) September 16, 2024
దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఫిర్యాదులో ఆమె చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో అవుట్‌డోర్ షూటింగ్‌లకు వెళ్లిన సమయంలో జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె తెలిపింది. నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి తదుపరి విచారణ చేస్తున్నారు. అతనిపై ఐపిసి సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506) మరియు స్వచ్ఛందంగా గాయపరచడం (323)లోని క్లాజ్ (2) మరియు (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అలాగే జాని మాస్టర్‌కు గతంలో సైతం నేర చరిత్ర కలిగి ఉంది.. 2015లో ఓ కాలేజిలో మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్‌లోని స్థానిక కోర్టు జానీ మాస్టర్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. జానీ మాస్టర్‌పై కేసు నమోదు కావడంతో ఇది పొలిటికల్‌గా కూడా హాట్ టాపిక్‌గా మారింది. జానీ మాస్టర్ జనసేనలో కీలకంగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన జనసేన పార్టీ తరుఫున ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. పవన్ కల్యాణ్ సైతం ఆయన్ను జనసేన స్టార్ క్యాంప్‌నర్‌గా నియమించారు.
Johnny master present in Safe hands @IamSaiDharamTej @PawanKalyan @NagaBabuOffl pic.twitter.com/UuRN1ldiOO
— YSJagan Fan (@ysjaganfan_) September 16, 2024
ఇటీవల జానీ మాస్టర్ మీడియాతో మాట్లాడుతూ..పవన్ కల్యాణ్ త్వరలోనే సీఎం అవుతారంటూ కామెంట్స్ చేశారు. దాంతో ఆయన్ను టార్గెట్ చేసుకుని వైసీపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌ను టార్గెట్ చేసుకున్నారు. కూటమి విజయం సాధించిన తర్వాత పవన్ కల్యాణ్ ఫొటో ట్వీట్ చేస్తూ.. ఏపీ సేఫ్ హ్యాండ్స్‌లో ఉందంటూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడు జానీ మాస్టర్‌తో సాయి ధరమ్ తేజ్ ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ .. ఏపీ సేఫ్ హ్యాండ్స్ అంటూ వెటకారం చేస్తూ వైసీపీ శ్రేణులు పోస్టులు పెడుతున్నారు. గతంలో కూడా సాయి ధరమ్ తేజ్‌ను టార్గెట్‌గా వైసీపీ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
2034 Pawan has a PM : Johnny master pic.twitter.com/YCHeYzqpd4
— Raju (@rajulike7) September 3, 2024












Click it and Unblock the Notifications