విశాఖలో గెలుపెవరిది -అదే డిసైడింగ్ ఫ్యాక్టర్, డేంజర్ బెల్స్..!!
ఏపీ ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ స్థానం కీలకంగా మారుతోంది. విశాఖ ను పరిపాలన రాజధాని చేస్తామని వైసీపీ ప్రకటించింది. అమరావతే రాజధానిగా ఉండాలని కూటమి డిమాండ్ చేస్తోంది. గత అయిదేళ్ళ కాలంగా విశాఖ లో రాజకీయంగా ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కూటమిలో బీజేపీ ఆశలు పెట్టుకున్న విశాఖ సీటు టీడీపీకి దక్కింది. అక్కడ వైసీపీ నుంచి బొత్సా జాన్సీ పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి భరత్ బరిలోకి దిగారు. ఇక్కడే అనూహ్య రాజకీయం తెర మీదకు వచ్చింది.
బీజేపీ చివరి ప్రయత్నాలు
కూటమి నుంచి టీడీపీకి విశాఖ సీటు ఖాయమైనా బీజేపీ నేతలు ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు. జివిఎల్ నరసింహారావు ఇంకా తనకు సీటు వస్తుందన్న ఆశతో ఉన్నారు. ఢిల్లీకి పలుసార్లు వెళ్లడం, విశాఖ నుంచి తన అనుచరులతో అమిత్ షా, మోడీకి లేఖలు రాయిస్తున్నారు. విశాఖ పరిధిలోని తూర్పు అసెంబ్లీ సీటు నుంచి టీడీపీ అభ్యర్దిగా వెలగపూడి , వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ పోటీ పడుతున్నారు. టిడిపి అభ్యర్థి వెలగపూడి గతంలో ఆయనకు సహకరించిన సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు ఇటీవల వైసిపిలో చేరడం టిడిపికి ఈ సెగ్మెంట్‌లో పెద్ద ఎదురుదెబ్బే. సౌత్ నుంచి జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ బరిలో ఉన్నారు. ఆయనకు దక్షిణంలో టికెట్ ఇవ్వడం పట్ల జనసేన, టిడిపి నాయకులు గుర్రుగా ఉన్నారు.

హోరా హోరీ పోరు
ఉత్తరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్థిగా కెకె రాజు బరిలో ఉన్నారు. ఆయనపై కొంత సానుభూతి వ్యక్తమవుతోంది. కూటమిలో బిజెపికి ఈ సీటు దక్కింది. మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఆ పార్టీ తరపున మళ్లీ పోటీ చేస్తున్నారు. జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో 2019లో టిడిపి నుంచి గెలిచిన పెతకంశెట్టి గణబాబు ఈసారీ పోటీ చేస్తున్నారు. ఆయనపై వైసిపి అభ్యర్థిగా ఆడారి ఆనంద్ కుమార్ బరిలో నిలిచారు. గణబాబుపై కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. గాజువాక నియోజకవర్గం నుంచి టిడిపి తరపున పల్లా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసిపి అభ్యర్థిగా గుడివాడ అమర్‌నాథ్ పోటీలో ఉన్నారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు పూనుకున్న బిజెపితో టిడిపి, జనసేన పొత్తుపెట్టుకోవడం పట్ల కూటమిపై కార్మికవర్గం, ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
గెలుపు దక్కేదెవరికి
భీమిలి అసెంబ్లీ స్థానానికి సంబంధించి టిడిపి నుంచి గంటా శ్రీనివాసరావు పోటీలో ఉన్నారు. వైసిపి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు బరిలో ఉన్నారు. తొలి నుంచీ ముత్తంశెట్టి ప్రచారంలో ఉన్నప్పటికీ గంటా బలమైన అభ్యర్థి కావడంతో వైసిపి శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఇక, విశాఖలో ఉత్తరాది ప్రాంతం వారు, ఒడిశాకు చెందిన వారు గణనీయంగా ఉన్నారు. ప్రభుత్వం అందించిన సంక్షేమం, సామాజిక లెక్కలు కలిసి వస్తాయని వైసీపీ అంచనా వేస్తోంది. విశాఖలో చోటు చేసుకున్న పరిణామాలు..మూడు పార్టీల బలం తమను గెలిపిస్తుందని కూటమి భావిస్తోంది. దీంతో, విశాఖ ఎంపీ సీటు గెలుపు పైన రాజకీయంగా ఆసక్తి కొనసాగుతోంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications