Year Ender 2021 : ఈ ఏడాది పతాకస్ధాయికి సంక్షేమం-అప్పుల పుట్టగా రాష్ట్రం-జగన్ ధీమా అదే
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి ఈ ఏడాది కూడా ఆర్ధిక ఇబ్బందులు కొనసాగాయి. కేంద్రం నుంచి సకాలంలో నిధులు విడుదల కాకపోవడం, బహిరంగ మార్కెట్ నుంచి అప్పులు కూడా తగ్గిపోవడంతో అప్పులు తీర్చేందుకు సైతం కొత్త అప్పులు చేసుకుంటూ వెళ్లింది. ఎన్ని ఇబ్బందులున్నా, నిధుల రాక తగ్గిపోతున్నా ప్రభుత్వం మాత్రం తన సంక్షేమ పథకాల్ని కొంత పుంతలు తొక్కించుకుంటూ ఏకంగా పతాకస్దాయికి తీసుకెళ్లింది.

సంక్షేమ రాజ్యం
ఏపీలో ఈ ఏడాది సంక్షేమ పాలన కొత్త పుంతలు తొక్కింది. నవరత్నాల పేరుతో ఎన్నికల్లో ఇచ్చిన మ్యానిఫెస్టో ఎలాగైనా అమలు చేసి తీరాలన్న సీఎం జగన్ పట్టుదలతో ప్రభుత్వం, అధికారులు పరుగులు పెట్టారు. పేదలు, బడుగు, బలహీన వర్గాలు, విద్యార్ధులు, తల్లులు, ఇలా ఏ ఒక్కరినీ వదలకుండా ప్రభుత్వం సంక్షేమ పథకాల్ని ఈ ఏడాది కూడా విజయవంతంగా కొనసాగించింది.
ఇప్పటికే సంక్షేమ పథకాల కోసమే ఏడాదికి దాదాపు లక్ష కోట్లు ఖర్చు చేస్తోందని పేరు తెచ్చుకున్న ప్రభుత్వం మరో ఏడాది కూడా విజయవంతంగా ఆ స్ధాయి ఖర్చుపెట్టింది.

పతాకస్ధాయికి సంక్షేమం
ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఈ ఏడాది పతాకస్ధాయికి చేరుకున్నాయి. గతంలో ప్రకటించిన పథకాలతో పాటు మధ్యలో తీసుకున్న పథకాలు కూడా అమలు చేయాల్సిన పరిస్ధితి ప్రభుత్వానికి ఎదురైంది. అయినా ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గలేదు.
భారీ ఎత్తున అప్పులు చేసి మరీ సంక్షేమ రథాన్ని నడిపిస్తోంది. ఇదే క్రమంలో గతంలో ఏదైనా కారణంతో సంక్షేమ పథకాలు అందని వారికి సైతం తాజాగా ఏడాదికి రెండుసార్లు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడం బహుశా దేశంలోనే ప్రప్రధమంగా నిలిచింది. తాజాగా సీఎం జగన్ ఈ కార్యక్రమం కింద రూ.703 కోట్లు విడుదల చేశారు.

అప్పుల పాలవుతున్నా
సంక్షేమ పాలనలో భాగంగా మ్యానిఫెస్టోను యథాతథంగా అమలు చేసే క్రమంలో వైసీపీ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేస్తోంది. పాత అప్పులకు వడ్డీలు కడుతూనే కొత్త అప్పులు చేస్తూ వెళ్తున్న ప్రభుత్వం సంక్షేమం ఎక్కడా గాడి తప్పకుండా చూసుకునేందుకే ఈ ఏడాది కూడా ప్రాధాన్యమిచ్చింది.
దీంతో ప్రభుత్వం మరింత అప్పుల ఊబిలోకి వెళ్లింది. ఈ క్రమంలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారనే అపప్రదను మూటగట్టుకుంది. అయినా ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అప్పుల విషయంలో విపక్షాల విమర్శల్ని సైతం ఏమాత్రం పట్టించుకోకుండా కేంద్రం, రుణదాతల చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉంది.

జగన్ లో అంతులేని ధీమా
భారీ ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తనను భవిష్యత్తులో జరిగే ప్రతీ ఎన్నికల్లో తనను గట్టెక్కిస్తాయని సీఎం జగన్ గట్టిగా నమ్ముతున్నారు. దీంతో వేల కోట్లు అప్పులు చేసయినా సరే సంక్షేమ పాలన గాడి తప్పకూడదని ఆయన భావిస్తున్నారు. అందుకే అప్పులు కోట్లకు కోట్లు దాటిపోతున్నా ఎక్కడా వెనక్కి తగ్గేందుకు సిద్ధపడటం లేదు. రాష్ట్రంలో అభివృద్ధి లేదని విపక్షాలు విమర్శలు చేస్తున్నా సంక్షేమ రథాన్ని పరుగులు తీయించే క్రమంలో అవేవీ పట్టించుకోవడానికి ఆయన సిద్ధంగా లేరు.
దీంతో సంక్షేమమంటే వైఎస్ అనే స్దాయి నుంచి ఈసారి తన పేరు చెప్పుకునే విధంగా పథకాల అమలు చేస్తున్నారు. అన్ని పథకాలను తానే స్వయంగా ప్రారంభిస్తూ వాటి ప్రాధాన్యతను లబ్దిదారులకు సైతం గుర్తు చేస్తున్నారు. దీంతో మరో ఏడాది ఏపీలో సంక్షేమ పాలన సాగిందని చెప్పవచ్చు.
-
ఏపీ విద్యార్ధులకు సర్కార్ గుడ్ న్యూస్..! దేశంలో తొలిసారి..! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications