year ender 2023: గూగుల్ లో ఎక్కువ సెర్చ్ చేసిన పర్యాటక ప్రాంతాలివే!!
2023 సంవత్సరం మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది. 2024 సంవత్సరానికి స్వాగతం పలకడానికి దేశం సిద్ధమైంది. ఈ సమయంలో ఈ సంవత్సరం ఎవరెవరు ఏం చేశారు? జరిగిన ముఖ్య సంఘటనలు ఏమిటి? తిరిగిన పర్యాటక ప్రాంతాలు ఏమిటి? ఇటువంటి అనేక అంశాలను ప్రతి ఒక్కరు నెమరు వేసుకుంటున్నారు.
ఈ క్రమంలో ఈ సంవత్సరం గూగుల్ లో టాప్ టెన్ స్థానాల్లో నిలిచిన అనేక అంశాలపై google తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఈ సంవత్సరం గూగుల్ లో ఎక్కువ సెర్చ్ చేసిన పర్యాటక ప్రాంతాలను రిలీజ్ చేసింది. గూగుల్ లో ఎక్కువ సెర్చ్ చేసిన పర్యాటక ప్రాంతాలలో టాప్ వన్ లో ఏది ఉంది? ఏ ఏ ప్రాంతాలను ఎక్కువగా జనాలు వెళ్లడానికి సెర్చ్ చేశారు? తెలుసుకుందాం.

ఈ సంవత్సరం గూగుల్లో ఎక్కువ సెర్చ్ చేసిన పర్యాటక ప్రాంతాలలో టాప్ వన్ ప్లేస్ లో వియత్నాం నిలిచింది. మంచి పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని భావించేవారు వియత్నాం సందర్శించవచ్చు. వియత్నాం లో హాయి గొలిపే బీచ్లు, అందమైన వాస్తు శిల్పాలు, బౌద్ధ పగోడా లకు, చారిత్రక అవశేషాలకు ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం. 2023 సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని గూగుల్లో ఎక్కువ సెర్చ్ చేశారు .

2023 సంవత్సరంలో గూగుల్లో ఎక్కువ సెర్చ్ చేసిన పర్యాటక ప్రదేశాలలో రెండవ స్థానంలో నిలిచింది గోవా. గోవా సముద్ర తీర ప్రాంతాలతో, సాంస్కృతిక, చారిత్రిక కట్టడాలతో సుసంపన్నమై కనిపిస్తుంది. ఇక గోవా గురించి తెలుసుకోవడానికి, గోవా వెళ్లడానికి చాలామంది ఆసక్తి చూపినట్టుగా google సెర్చ్ ని బట్టి అర్థమవుతుంది. ఆ తర్వాత స్థానంలో నిలిచింది బాలీ.

గూగుల్లో ఎక్కువమంది సెర్చ్ చేసిన టాప్ 10 పర్యాటక ప్రాంతాలు ఇవే
| 1 | వియత్నాం |
| 2 | గోవా |
| 3 | బాలి |
| 4 | శ్రీలంక |
| 5 | థాయిలాండ్ |
| 6 | కాశ్మీర్ |
| 7 | కూర్గ్ |
| 8 | అండమాన్ మరియు నికోబార్ దీవులు |
| 9 | ఇటలీ |
| 10 | స్విట్జర్లాండ్ |
ఈ పర్యాటక ప్రాంతాలను గురించి తెలుసుకోవడానికి, పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపించినట్టు google సెర్చ్ ఆధారంగా తెలుస్తుంది.












Click it and Unblock the Notifications