Year Ender 2024: జల విలయం - తీరని విషాదం..!!
తెలుగు రాష్ట్రాలకు 2024 తీరని విషాదం మిగుల్చింది. జల విలయంలో రెండు రాష్ట్రాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఏకధాటిగా కురిసిన వర్షాలకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఫ్లాష్ ఫ్లడ్స్ ముంచెత్తాయి. విజయవాడ, ఖమ్మంలో భారీ నష్టాన్ని మిగుల్చాయి. రెండు రాష్ట్రాల సీఎం లు ప్రత్యేకంగా సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇక, వీడని వర్షాలతో రైతులకు అపార నష్టం తప్పలేదు. కేంద్రం సైతం రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు విపత్తు సాయం ప్రకటించింది. కానీ, ఆ నష్టం నుంచి బాధితులు ఇంకా పూర్తిగా కోలుకోలేదు.
ముంచెత్తిన బుడమేరు
2024 లో ప్రకృతి విపత్తులు భారీ నష్టాన్ని మిగిల్చాయి. వరుసగా కురిసన వర్షాలకు నదులు పొంగి ప్రవహించాయి. వరద నీరు పోటెత్తింది. ఇళ్లళ్లోకి వరద నీరు లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు. ఆగస్టు 31, 2024 రాత్రి ఖమ్మం, విజయవాడ నగరాలను వరదనీరు ముంచెత్తింది. రికార్డు స్థాయిలో వరదనీరు ఈ రెండు నగరాలపై పడడంతో భారీగా ప్రాణ నష్టం జరిగింది.
బుడమేరు , పాలేరు, మున్నేరు నదులు రికార్డుస్థాయిలో పొంగిపొర్లి రెండో అంతస్తు వరకు వరద నీరు చేరింది. బుడమేరుకు 60 వేల క్యూసెక్యుల వరదనీరు వచ్చి చేరింది. బుడమేరు డైవర్షన్ ఛానల్‌కు ఏకంగా మూడు గండ్లు పడ్డాయి. దీంతో రాత్రికి రాత్రే ఒక్కసారిగా పెద్దఎత్తున విజయవాడ నగరాన్ని వరదనీరు ముంచెత్తింది.

బాధితులకు అండగా
ఫలితంగా పలు కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. దాదాపు రెండు వారాలపాటు ప్రజలు పలు రకాల అవస్థలు పడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యవేక్షించారు. కలెక్టరేట్ లోనే మకాం వేసారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. వరదల కారణంగా సర్వం కోల్పోయిన విజయవాడ వాసులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. వారికి వరద సహాయాన్ని సీఎం చంద్రబాబు సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు సెప్టెంబర్‌లో విజయవాడలోని 179 సచివాలయాల పరిధిలోని ప్రజలకు వరద సహాయాన్ని వారి ఖాతాల్లో వేసేందుకు చర్యలు చేపట్టింది. వరద బాధితులకు అండగా నిలిచేందుకు పలువురు ప్రముఖులు, సినీ హీరోలు, స్వచ్చంద సంస్థలు, వ్యాపార వేత్తలు, సామాన్యులు సైతం ముందుకు వచ్చి విరాళాలు అందించారు. దాదాపు రూ 1500 కోట్ల మేర విరాళాలు వచ్చాయి.
వరదలకు ప్రాణ నష్టం
వరదల్లో నష్టపోయిన వారికి ప్రభుత్వం ఆర్దిక సాయం అందించింది. మొత్తం 4.21 లక్షల మందికి రూ.630 కోట్లను పరిహారంగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. మరోవైపు వాహనాలకు సైతం పరిహారం అందేలా ఇన్సూరెన్స్ కంపెనీలతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించి లబ్ది చేకూర్చారు. వరదలకు ఏపీ వ్యాప్తంగా 32 మంది మృతిచెందారని ప్రభుత్వం గణాంకాలు విడుదల చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో 24 మంది, గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారని అధికారికంగా వెల్లడించారు. 1,69,370 ఎకరాల్లో పంటలు, 18,424 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది.
కేంద్ర సాయం
అటు తెలంగాణలో మున్నేరుకు వరదనీరు పోటెత్తి ఖమ్మం నగరంపై పడింది. ఒక్కసారిగా పెద్దఎత్తున వరదనీరు రావడంతో దిక్కుతోచని స్థితికి ప్రజలు చేరుకున్నారు. బాధితులనే బోట్ల సహాయంతో వారిని రిలీఫ్ క్యాంపు లకు తరలించి ఆహారం, మంచినీరు అందజేశారు. వర్షాలు, వరదలు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రూ.5438 కోట్ల నష్టం వాటిల్లింది. వరదలకు 29 మంది మృతిచెందారు. ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, వరదల మూలంగా రూ.730 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.16,500 ఆర్థికసాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా నష్టపోయిన 14 రాష్ట్రాలకు కేంద్రం రూ.5,858.6 కోట్ల నిధులు ప్రకటించింది. ఇందులో ఏపీకి రూ.1,036 కోట్లు, తెలంగాణకు రూ.416.8 కోట్లు కేటాయించింది.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications