మీ బినామీల ఆస్తులు లక్షల కోట్లు ఉండగా ఈ జోలె పట్టి అడుక్కోవటం దేనికి బాబు: విజయసాయి సెటైర్లు

ఏపీలో మూడు రాజధానుల రగడ కొనసాగుతున్న సమయమలో కూడా చంద్రబాబును వదలకుండా విజయ సాయి రెడ్డి తిట్టిపోస్తూనే ఉన్నారు. ఏ చిన్న సందర్భం దొరికినా చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించే విజయసాయి రెడ్డి తాజాగా చంద్రబాబు జోలె పట్టి విరాళాలు సేకరించటంపై కూడా విమర్శలు చేశారు.

చంద్రబాబు జోలె పట్టటంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు

చంద్రబాబు జోలె పట్టటంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు

ఏపీ రాజధాని అమరావతినే కొనసాగించాలని అటు రాజధాని రైతులతో పాటు ప్రతిపక్షాలు కూడా పోరుబాట సాగిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ మొదట నుండి ఏపీ రాజధాని అమరావతినే కొనసాగించాలని తమ స్టాండ్ వినిపిస్తుంది. ఇక ఇదే క్రమంలో జగన్ మూడు రాజధానుల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న క్రమంలో ఏపీలో ఆందోళనలు ఉధృతం అయ్యాయి. వైజాగ్ వద్దు అమరావతి ముద్దు అంటున్న రాజధాని గ్రామాల రైతులకు బాసటగా పోరాటం సాగిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న మచిలీపట్నంలో నిర్వహించిన అఖిలపక్ష పాదయాత్రలో రాజధాని రైతుల పోరాటం కోసం జోలె పట్టి విరాళాలు సేకరించారు .ఇక చంద్రబాబు జోలె పట్టటంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు.

గంటల వ్యవధిలో కోట్ల రూపాయలు పోగు చేయగల స్తోమత ఉండి ఇదేం పని

గంటల వ్యవధిలో కోట్ల రూపాయలు పోగు చేయగల స్తోమత ఉండి ఇదేం పని

అమరావతి రైతుల పోరాటానికి మద్దతు కోసం మచిలీపట్నంలో అఖిలపక్ష పాదయాత్రలో పాద జోలె పట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు విరాళాలు సేకరించారు. మచిలీపట్నం మెయిన్ సెంటర్‌ లో చంద్రబాబు జోలె పట్టారు. విరాళాలు సేకరించారు. ఇక దీనిపై విజయసాయి చాలా వ్యంగ్యంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. గంటల వ్యవధిలో కోట్ల రూపాయలు పోగు చేయగల స్తోమత ఉన్న వాళ్లు, జనాల ముందు జోలె పట్టి విరాళాలు అడగటం దేనికని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.

మీ బినామీలు, అనుచర వర్గం ఆస్తులు లక్ష కోట్ల పైనే.. మళ్ళీ జోలె ఎందుకు

మీ బినామీలు, అనుచర వర్గం ఆస్తులు లక్ష కోట్ల పైనే.. మళ్ళీ జోలె ఎందుకు

తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసిన ఆయన, ఇన్ సైడర్ ట్రేడింగులో భూములు కొన్న మీ బినామీలు, అనుచర వర్గం ఆస్తులు లక్ష కోట్ల పైనే ఉంటాయి. ఒక్క గంటలో వెయ్యి కోట్లు పోగు చేసే స్థోమత ఉన్నోళ్లు మీరంతా. మీరివ్వకుండా జనం మీద పడి జోలె చాపడం ఏమిటి చంద్రబాబూ? తుపాకులు కొని సాయుధ పోరాటం గాని మొదలు పెడతారా ఏంటి? అని వ్యంగ్యంగా మాట్లాడారు. టీడీపీ నాయకులు ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసి బాగానే సంపాదించారు. బాగానే బాగుపడ్డారు. ఇంకా జనాల ముందు ఈ జోలె పట్టి వేసే నాటకాలు దేనికి అన్న భావనలో విజయసాయి చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు గుప్పించారు.

మీ ఆస్తుల విలువ తగ్గకుండా ఉండేందుకు ప్రజలంతా సమిధలు కావాలా ?

మీ ఆస్తుల విలువ తగ్గకుండా ఉండేందుకు ప్రజలంతా సమిధలు కావాలా ?

ఇక మరో ట్వీట్ లో చంద్రబాబును ఉద్దేశించి అమరావతిని రక్షించుకోలేకపోతే చనిపోయినట్టేనట. రాజధాని ఒకే చోట ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా యువత ఆందోళన చేయాలట. మీ బినామీలు, సొంత మనుషుల ఆస్తుల విలువ తగ్గకుండా కాపాడటానికి ప్రజలంతా సమిధలు కావాలా? మీలాంటి స్వార్థపరుడు ప్రతిపక్ష నేతగా ఉండటం కర్మ కాకపోతే మరేంటి? అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+