షర్మిల పై అవినాశ్ సంచలన వ్యాఖ్యలు...!!
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమి వర్సస్ వైసీపీ రాజకీయం హోరా హోరీగా కనిపిస్తోంది. కడప కేంద్రంగా వైఎస్ కుటుంబ వారసుల రాజకీయ పోరు తారా స్థాయికి చేరింది. కడప నుంచి పీసీసీ చీఫ్ షర్మిల కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ అవినాశ్ పోటీ చేస్తున్నారు. వివేకా హత్య కేసు ను ప్రస్తావిస్తూ అవినాశ్ పైన షర్మిల చేస్తున్న ప్రచారం పైన అవినాశ్ సీరియస్ గా స్పందించారు.
కడప ఎంపీ సీటులో షర్మిల వర్సస్ అవినాశ్ ఎన్నికల పోరు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని పెంచుతోంది. పీసీసీ చీఫ్ గా షర్మిల ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కడప ఎంపీగా సోదరి సునీతతో కలిసి తన చిన్నాన్న హత్య అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అవినాశ్ పైన సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

వివేకా కేసులో అవినాశ్ పైన షర్మిల చేస్తున్న కామెంట్స్ పై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో అవినాశ్ తొలి సారిగా షర్మిల చేస్తున్న ప్రచారం పై స్పందించారు. తాను వైయస్ వివేకాను హత్య చేసిన హంతకుడినంటూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలు అమె విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ వైయస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు.
షర్మిల చేసిన ఆ వ్యాఖ్యలు వినడానికే చాలా భయంకరంగా ఉన్నాయన్నారు. మసి పూసి బూడిద జల్లి తుడుచుకొమంటారని ఆవేదన వ్యక్తం చేసారు. తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారని వ్యాఖ్యా నించారు. అందుకే వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అవినాష్‌రెడ్డి అన్నారు. మాట్లాడేవాళ్లు ఎంతైనా మాట్లాడుకోవచ్చని.. ఆ వ్యాఖ్యలను వాళ్ల విజ్ఞతకే వదిలేస్తానని, అదే మంచిదని వ్యాఖ్యానించారు.
మాట్లాడే వాళ్లు ఎమైనా ఎంతైనా మాట్లాడుకొనీయమని చెప్పుకొచ్చారు. కాకపోతే మాట్లాడే వాళ్లు మనుషులైతే విజ్ఞత, విచక్షణ ఉండాలన్నారు. మాట్లాడే వారిది మనిషి పుట్టుకే అయితే కొంచమైనా విజ్ఞత, విచక్షణ ఉంటుంది కదా..అని అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. మరో వైపు సునీత తన విమర్శల వేడి పెంచారు. అవినాశ్ లక్ష్యంగా విమర్శలను ఎక్కుపెట్టారు. దీంతో, కడప పార్లమెంట్ సీటులో రాజకీయ లెక్కలు ఆసక్తిని పెంచుతున్నాయి.












Click it and Unblock the Notifications