ఈడీ విచారణకు హాజరైన జగన్, 'కిడ్నాప్ చేసి ఇతర రాష్ట్రాల్లో దాచారు'

హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ జెరూసలేం పర్యటన ముగిసింది. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన జెరూసలేం, ఆ తర్వాత యూరప్ దేశాల్లో పర్యటించారు. తన పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు.

హైదరాబాద్ చేరుకున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను ఆ పార్టీ నేతలు ఆదివారం కలిశారు. తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిణామాలపై వారితో చర్చించారు. వైయస్ జగన్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నారు.

ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇచ్చినందుకు గాను జగన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అక్రమాస్తుల కేసులో ఈడీ విచారణకు వైయస్ జగన్, విజయసాయిరెడ్డి సోమవారం నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. జగన్‌ అక్రమాస్తులకు సంబంధించిన ఈడీ నమోదు చేసిన కేసుపై సోమవారం కోర్టులో విచారణ జరిగింది.

గవర్నర్‌ను కలిసిన వైసీపీ నేతలు

గవర్నర్‌ను కలిసిన వైసీపీ నేతలు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం ఉదయం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు.

గవర్నర్‌ను కలిసిన వైసీపీ నేతలు

గవర్నర్‌ను కలిసిన వైసీపీ నేతలు

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని, అధికార పార్టీ ఆగడాలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

గవర్నర్‌ను కలిసిన వైసీపీ నేతలు

గవర్నర్‌ను కలిసిన వైసీపీ నేతలు

ప్రధానంగా ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీని చేజిక్కించుకునేందుకు టీడీపీ అడ్డదారులు తొక్కుతోందని ఆరోపించారు.

గవర్నర్‌ను కలిసిన వైసీపీ నేతలు

గవర్నర్‌ను కలిసిన వైసీపీ నేతలు

తమ పార్టీకి చెందిన 35 మంది జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఆచూకీ గల్లంతయిందని ఫిర్యాదు చేశారు. తమ పార్టీ నేతలు కనిపించేదాకా ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు.

గవర్నర్‌ను కలిసిన వైసీపీ నేతలు

గవర్నర్‌ను కలిసిన వైసీపీ నేతలు

కిడ్నాప్ చేసిన వారిని ఇతర రాష్ట్రాల్లో దాచారని ఫిర్యాదు చేశారు. గవర్నర్‌ నరసింహాన్‌ను కలిసిన వారిలో వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రకాశం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+