Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అనిల్ కు జగన్ కీలక బాధ్యతలు - బిగ్ షాట్స్ పై గురి..!!

కేంద్రం జమిలి దిశగా కసరత్తు చేస్తున్న వేళ ఏపీ లోనూ కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నా యి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తయింది. ప్రభుత్వం పై వైసీపీ పోరుబాట ప్రారంభించింది. కూటమి నేతలు జగన్ లక్ష్యంగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఇదే సమయంలో జిల్లాల పర్యటనలకు జగన్ సిద్దం అవుతున్నారు. ఎన్నికల్లో భారీ పరాజయంతో పార్టీ బలోపేతం పైన జగన్ వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా మాజీ మంత్రి అనిల్ కు జగన్ అప్పగించిన బాధ్యతల పైన చర్చ మొదలైంది.

జగన్ తాజా నియామకాలు
మాజీ సీఎం జగన్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయటం పైన ఫోకస్ చేసారు. సంక్రాంతి లోగా రాష్ట్ర స్థాయి నుంచి మండలాల వరకు అన్ని కమిటీలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే పలువురు నేతలకు రాష్ట్ర పదవులు ఖరారు చేసారు. జిల్లాల అధ్యక్షులను నియమించారు. గతం లో ఎన్నికల వేళ చేసిన ప్రయోగం విఫలం కావటంతో మాజీ ఎమ్మెల్యేలను తిరిగి వారి సొంత నియోజకవర్గాలకు సమన్వయకర్తలుగా నియమిస్తున్నారు. ఇదే సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ ను పీఏసీ మెంబర్‌గా నియమిస్తూ జగన్ ప్రకటించారు. నెల్లూరు లో కీలక బాధ్యతలు అప్పగించారు.

YS Jagan appoints Anil as PAC member as latest appointments in the party

అనిల్ కు కీలక బాధ్యతలు
2024 ఎన్నికల్లో అనిల్ నర్సరావు పేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి గెలిచిన అనిల్ కు జగన్ మంత్రివర్గంలో కీలకమైన ఇరిగేషన్ శాఖ కేటాయించారు. మంత్రిగా ఉన్న సమయంలోనే సొంత పార్టీ నేతల నుంచి నెల్లూరులోనే అనిల్ వ్యతిరేకత ఎదుర్కొన్నారు. అనిల్ స్థానం ఆ తరువాత కాకాణి గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి దక్కింది. జిల్లాలో ఆధిపత్య పోరు మొదలైంది. జిల్లాలో వైసీపీకి బలమైన నేతలుగా పేరున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, కీలక నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ వీడారు. 2019 లో జిల్లాను క్లీన్ స్వీప్ చేసిన వైసీపీకి ఈ సారి ఒక్క సీటు దక్కలేదు.

సమన్వయం సాధ్యమేనా
దీంతో, ఇప్పుడు నెల్లూరులో మార్పులు చేర్పుల పైన జగన్ ఫోకస్ చేసారు. కొంత కాలంగా పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా లేని అనిల్ వ్యక్తిగత కారణాలతోనే పాల్గొనటం లేదని.. తాను జగన్ తోనే కొనసాగుతానని ప్రకటించారు. నెల్లూరు సిటీ నుంచి తాజా ఎన్నికల్లో పోటీ చేసిన ఖలీల్ స్థానం లో తిరిగి అనిల్ ను నియమిస్తారని భావించారు. కానీ, అనిల్ కు కీలకమైన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ లో స్ధానం కల్పించారు. నెల్లూరు సిటీ నుంచి ప్రస్తుతం మంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తు న్నారు. అదే విధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. దీంతో, వీరిని ఎదుర్కోవటంతో పాటుగా నెల్లూరు సిటీ, అర్బన్ ప్రాంతాల్లో పార్టీ బలోపేతంకు పని చేయాలని అనిల్ ను పార్టీ ఆదేశించింది. అనిల్ కు కీలక పదవి ఇవ్వటంతో జిల్లా వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+