పవన్ ను ఆడిస్తున్న చంద్రబాబు-పెళ్ళిళ్లే కాదు సీట్లూ నాలుగే- కాకినాడలో జగన్ కామెంట్స్..!

కాకినాడలో జరిగిన మేమంతా సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్ విపక్షాలపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో విపక్ష కూటమి చంద్రబాబు తన మనుషుల్ని పంపితే ఏర్పాటైందన్నారు. దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే కూటమి ఏర్పడలేదని, బాబు చెప్పినట్లుగానే పనిచేస్తుందన్నారు. చంద్రబాబుకు ఎక్కడ కావాలంటే అక్కడ పవన్ పోటీ చేస్తారన్నారు. బాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నారు. పవన్ కు 20 సీట్లిస్తామన్నా జీహుజూర్ అన్నాడన్నారు. ప్యాకేజీ స్టార్ కు రాష్ట్రమంటే చులకన అని, జ్వరం వస్తే హైదరాబాద్ వెళ్లిపోయేంత చులకన అన్నారు. పవన్ కు ఏ ప్రాంతమైనా, భార్య అయినా ప్రేమ ఉండదన్నారు. పెళ్ళిళ్లే కాదు నియోజకవర్గాలు కూడా నాలుగయ్యాయన్నారు.

కూటమిలో ఉన్న వదినమ్మ (పురందేశ్వరి) బాబు చెబితే కాంగ్రెస్ లో చేరిందని, ఆ తర్వాత బీజేపీలో చేరిందని, బాబు చెప్తే సొంత తండ్రినే పొడిచేసిందన్నారు. బాబు ఏం చెప్తే అదే చేస్తుందన్నారు. బాబు ప్రలోభాలు ఏ స్ధాయిలో ఉంటాయంటే బీ ఫాం కాంగ్రెస్, బీజేపీదైనా, గాజుగ్లాస్ ది అయినా యూనిఫామ్ టీడీపీదే అన్నారు. చంద్రబాబు మ్యానిఫెస్టో కూడా ఎన్నికలయ్యేదాకా రంగురంగుల స్వప్నాలు చూపిస్తుందని, ఎన్నికలయ్యాక చెత్తబుట్టలో కనిపిస్తుందన్నారు.

ys jagan ask people to revote for continue schemes othewise babu will cut and stop everything

చంద్రబాబు వర్గానికీ, పేదలకూ మధ్య క్లాస్ వార్ జరుగుతోందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. పేదల వ్యతిరేక కూటమిని ఓడించేందుకు సిద్ధమా అని ప్రజలను ప్రశ్నించారు. వచ్చే ఐదేళ్లలో మీ బతుకులు మార్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నారు. ఇవాళ జగన్ ద్వారా అందుతున్న పథకాలు ఇకపై కూడా అందాలా వద్దా అన్నది మీ ఓటు మీద ఆధారపడి ఉంటుందన్నారు. బాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగిసిపోతాయన్నారు. చంద్రబాబు మోసాల మ్యానిఫెస్టో చెబుతున్న వాస్తవం ఇదేనన్నారు.

ys jagan ask people to revote for continue schemes othewise babu will cut and stop everything

ఫ్యాన్ కు ఓటేస్తే జగన్ మార్క్ సచివాలయాలన్నీ కొనసాగుతాయని, వాలంటీర్లు కొనసాగుతారని లేకపోతే బాబు మార్క్ కత్తిరింపులు ఉంటాయని జగన్ తెలిపారు. రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే జగన్ మార్క్ పథకాలు కొనసాగుతాయని, లేకపోతే బాబు మార్క్ వివక్ష ఉంటుందన్నారు. పొరబాటున చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ ఓ చంద్రముఖి నిద్రలేస్తుందని, ఓ పశుపుపతి నిద్రలేస్తాడని, వదల బొమ్మాళ్లీ అంటూ ఐదేళ్లు రక్తం తాగేందుకు మీ ఇంటికి వస్తాడన్నారు.

ఫ్యాన్ కు రెండు ఓట్లేస్తేనే రైతులకు పథకాలు అందుతాయని, ఉచిత విద్యుత్ అందుతుందని జగన్ తెలిపారు. పిల్లలకు మూడో తరగతిలోనే టోఫెల్ విద్య, ఎనిమిదో తరగతిలో బైజూస్ ట్యాబ్ లు వస్తాయన్నారు. లేదంటే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం రద్దు, నాడు-నేడు రద్దు, విద్యాకానుక, గోరుముద్ద రద్దవుతాయన్నారు. ఎవరికి ఓటేస్తే మంచి జరుగుతుందో ఒకటికి పదిసార్లు ఆలోచించాలన్నారు. ఈసారి ఎన్నికలు ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదని వచ్చే ఐదేళ్లలో మీ తలరాతల్ని మార్చేవి అన్నారు.

ys jagan ask people to revote for continue schemes othewise babu will cut and stop everything

గత ఎన్నికల్లో వివిధ కారణాలతో ఇతర పార్టీలకు ఓటు వేసిన వారు కూడా ఈసారి ఆలోచించాలని జగన్ కోరారు. గత ఎన్నికల్లో తనకు ఓటు వేయకపోయినా ఈ ఐదేళ్లలో మంచి చేశానన్నారు. మీ ఇంటికొచ్చిన విపక్షాల నేతలు అబద్ధాలు చెప్పొచ్చు కానీ మీ ఖాతాల్లో ఐదేళ్లలో జమ అయిన పథకాలు నిజమే చెప్తాయన్నారు. ఐదేళ్లలో మీకు మంచి చేశాను కాబట్టే తాను ఒంటరిగా ఓటు అడుగుతున్నానని, కానీ విపక్షాలు మోసం చేశాయి కాబట్టి కూటమిగా వస్తున్నాయన్నారు. మీ బిడ్డ ఒక్కడేనని, కానీ అటు నక్కలు, తోడేళ్లు అనేకం అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+