జైల్లో పుస్తకం రాసిన దాడి కేసు నిందితుడు: జగన్ కుటుంబాన్ని కలిసి రాజీకి యత్నం!!
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన గతంలో విశాఖపట్నం విమానాశ్రయంలో కత్తితో దాడి చేసిన శ్రీనివాస రావు జైలులో ఓ పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకాన్ని విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీనివాస రావు తరఫున సలీం అనే న్యాయవాది వాదిస్తున్నారు.

పుస్తకం విడుదలకు ప్రయత్నాలు
ఆ పుస్తకం విడుదల కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే జడ్జికి, జైళ్ల శాఖ డీజీకి లేఖలు అందించినట్లుగా కూడా శ్రీనివాస రావు తరఫు న్యాయవాది చెప్పారని తెలుస్తోంది. అంతేకాదు, శ్రీనివాస రావు ఇప్పటికీ జగన్ అభిమానిగానే ఉన్నారని, వైసీపీ అధినేతకు, ఆయన కుటుంబ సభ్యులకు క్రిస్మస్, న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పాలని కుతూహలపడ్డారని కూడా చెప్పారని తెలుస్తోంది.

వారితో మాట్లాడి కేసును ముగించే ప్రయత్నం
సరైన ఆధారాలు లేకుండా పోలీసులు శ్రీనివాస రావును ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన తరఫు లాయర్ తెలిపారు. అతనిని జగన్ కుటుంబ సభ్యుల వద్దకు తీసుకు వెళ్లి మాట్లాడించి, ఈ కేసును ముగించాలని చూస్తున్నామని చెబుతున్నారని తెలుస్తోంది.

సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో చంద్రబాబు ప్రభుత్వం
కాగా, జగన్ పైన దాడి కేసులో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేసును ఎన్ఐఏకు అప్పగించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు వచ్చాయి. గత ఏడాది అక్టోబర్ 25న జరిగిన దాడి కేసుపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. శుక్రవారం దీనిపై విచారణ జరిగింది. జగన్‌పై దాడి కేసులో ఏపీ ప్రభుత్వం సరిగ్గా దర్యాప్తు చేయలేదని, ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించాలని వైసీపీ న్యాయవాదులు కోరారు. కేసు విచారణ ఆలస్యమైతే న్యాయం జరగదన్నారు. దాడి జరిగిన ప్రదేశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి ఉంటుందని, కాబట్టి జాతీయ సంస్థలకు ఇవ్వొచ్చని భావించిన ధర్మాసనం.. కేసును ఎన్ఐఏకు అప్పగించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును దర్యాప్తు చేసి నిందితుడిని విచారించిందని, పూర్తి స్థాయిలో కేసు విచారణ జరిగిందని ఏపీ ప్రభుత్వం తరఫు లాయర్ వాదనలు వినిపించారు. కానీ హైకోర్టు కేసును ఎన్ఐఏకు అప్పగించింది. ఎన్ఐఏ అప్పుడే విచారణ ప్రారంభించింది. మరోవైపు అంతకుముందే ఎన్ఐఏకు కేంద్రం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెట్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసింది. కేసు నమోదును కేంద్రం హైకోర్టుకు తెలిపింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించే యోచనలో ఉంది.
-
AP Pensions: ఆ పెన్షన్లు తీసేశాం-తేల్చేసిన సర్కార్ ..! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!!












Click it and Unblock the Notifications