Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ మళ్ళీ సీఎం కావాలి: బైక్ యాత్ర చేస్తున్న వైఎస్ జగన్ వీరాభిమాని

జగన్ మళ్ళీ సీఎం కావాలని వైఎస్ జగన్ వీరాభిమాని ఒక టెకీ బైక్ యాత్ర చేస్తున్నారు.

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ కోసం ఏదైనా చేస్తామని వాళ్ళ సంఖ్య లెక్కకు మిక్కిలిగా ఉంటుంది. మళ్లీ వచ్చే ఎన్నికలలో విజయం సాధించి ఏపీకి జగన్ సీఎం కావాలని ఆకాంక్షిస్తున్న వారు కూడా లేకపోలేదు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై అభిమానంతో ఓ టెకీ హైదరాబాద్ నుండి ఆయన కోసం బైక్ యాత్ర చేస్తున్నాడు.

సీఎం జగన్ కోసం అభిమాని బైక్ యాత్ర

సీఎం జగన్ కోసం అభిమాని బైక్ యాత్ర


వైయస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావాలని, వచ్చే ఎన్నికలలో ఆయనకు ప్రజలు పట్టం కట్టాలని ఆకాంక్షిస్తూ ఆయన బైక్ యాత్ర చేస్తున్నాడు. ఒకపక్క రాత్రి వేళల్లో వర్క్ ఫ్రమ్ హోం లో భాగంగా నైట్ షిఫ్ట్ ఉద్యోగాన్ని చేస్తూనే మరోపక్క రోజుకు 100 నుంచి 125 కిలోమీటర్లు బైక్ యాత్ర చేస్తూ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా ఆదరించాలని తాను ప్రయాణం చేస్తున్న జిల్లాలలో ప్రచారం చేస్తున్నారు.

జగన్ మళ్ళీ సీఎం కావాలని హైదరాబాద్ నుండి విజయనగరం వరకు బైక్ యాత్ర

జగన్ మళ్ళీ సీఎం కావాలని హైదరాబాద్ నుండి విజయనగరం వరకు బైక్ యాత్ర

ఈనెల 6వ తేదీన జగన్ వీరాభిమాని అయిన వీరబాబు హైదరాబాద్ నుండి విజయనగరం వరకు యాత్ర చేయాలని మొదలుపెట్టారు. ప్రస్తుతం వీరబాబు యాత్ర చిత్తూరు జిల్లాకు చేరుకుంది. ఇక ఈ సందర్భంగా వీరబాబు మాట్లాడుతూ తన సొంత ఊరు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం అని 2009లో ఖమ్మంలోని వజీర్ సుల్తాన్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ లో చేరానని, వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా తాను నాలుగేళ్ల బీ టెక్ ను పూర్తి చేశానని పేర్కొన్నారు. ఆపై హైదరాబాద్లోనే ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పిన ఆయన వైఎస్ఆర్ తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఉన్న అభిమానంతో బైక్ యాత్ర మొదలుపెట్టినట్లుగా వెల్లడించారు.

జగన్ పథకాలు నచ్చి ఆయనపై అభిమానం పెరిగిందన్న వీరబాబు

జగన్ పథకాలు నచ్చి ఆయనపై అభిమానం పెరిగిందన్న వీరబాబు


ప్రతిరోజు ఉదయం 10 గంటలకు బైక్ యాత్రను ప్రారంభించి సాయంత్రం 6 గంటలకు పూర్తి చేస్తున్నట్టుగా ఆయన వెల్లడించారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన పథకాలు ఎంతో నచ్చాయని, అన్ని వర్గాల సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని అందుకే మళ్ళీ జగన్ సీఎం కావాలని పాదయాత్ర చేస్తున్నట్టు వీరబాబు వెల్లడించారు.

గతంలోనూ జగన్ పై అభిమానం చాటుకున్న వారెందరో ..

గతంలోనూ జగన్ పై అభిమానం చాటుకున్న వారెందరో ..

ఇదిలా ఉంటే గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే తను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యాత్ర చేస్తానని మొక్కుకున్న యువకుడు సీఎం జగన్ సీఎం అయిన తర్వాత సైకిల్ యాత్ర చేశారు. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి పైన అభిమానంతో వైసీపీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, బియ్యపు మధుసూదన్ రెడ్డి వంటి వారు ఏకంగా ఆయనకు గుడులే కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు తాజాగా వీరబాబు వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తన వీరాభిమానాన్ని చాటుకుంటూ బైక్ యాత్ర చేస్తున్నాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+