టీడీపీ ఎంపీకి జగన్ బిగ్ ఆఫర్ - మారుతున్న లెక్కలు..!?
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలతో పార్టీలు సిద్దం అవుతున్నాయి. ఇక వైసీపీకి అధికారం సాధ్యం కాదని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో ప్రభుత్వం పైన వ్యతిరేక పెరుగుతోందని.. తిరిగి అధికారంలోకి వచ్చేది తామేనని జగన్ ప్రతీ సందర్భంలోనూ చెబుతున్నారు. ఇదే సమయంలో పార్టీ వీడీని కీలక నేతల విషయంలోనూ జగన్ కొత్త ఆలోచనలు చేస్తున్నారు. తిరిగి పార్టీలోకి రావాలని ఆహ్వానాలు పంపుతున్నారు. ప్రస్తుత టీడీపీ ఎంపీకి జగన్ నుంచి వచ్చిన ఆహ్వానం ఆసక్తికరంగా మారుతోంది.
కూటమి వర్సస్ వైసీపీ రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. అమరావతి - మావిగన్ చర్చలు తారా స్థాయికి చేరాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ వీడి కూటమిలో చేరిన ముఖ్య నేతలను తిరిగి వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే ఈ మేరకు జగన్ కోర్ టీం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా గతంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా.. ప్రస్తుతం టీడీపీ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి సంబంధించి ఆసక్తి కర అంశం ప్రచారం లోకి వచ్చింది. వైసీపీలో ఉన్న సమయంలో జగన్ కు సన్నిహితంగా ఉన్న వేమిరెడ్డి.. 2024 ఎన్నికల సమయంలో నెల్లూరు లో సీట్ల కేటాయింపు విషయంలో విభేదించి బయటకు వచ్చారు. టీడీపీలో చేరారు. నెల్లూరు నుంచి వైసీపీ అభ్యర్దిగా పోటీ చేసిన విజయ సాయిరెడ్డి పైన పోటీ చేసి విజయం సాధించారు. ఆయన సతీమణి ప్రశాంతి సైతం ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాగా.. తాజాగా వేమిరెడ్డితో వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి సమావేశమయ్యారు.

టీడీపీలో గౌరవంగా ఉందని చెప్పిన ఎంపీ
ఆ సమయంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తిరిగి వైసీపీలోకి రావాలని జగన్ కోరుకుంటున్నారని .. ఒక సారి జగన్ ను కలవాలని అయోధ్య రామిరెడ్డి చెప్పినట్లు తెలిసింది. దీనికి స్పందించిన వేమిరెడ్డి తనకు టీడీపీలో గౌరవం గా చూస్తున్నారని.. పరిస్థితులు బాగానే ఉన్నట్లు చెప్పారని సమాచారం. దీంతో.. ఇప్పటికిప్పుడు వైసీపీలోకి వెళ్లాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఎన్నికలు పూర్తయి రెండేళ్లు కావటం.. 2029 ఎన్నికలకు ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉండటంతో ఇప్పుడు నేతలు పార్టీ మారటం పైన ఆసక్తి ఎలా చూపిస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వ్యవహారం లో జగన్ సూచన మేరకే అయోధ్య రామిరెడ్డి ఈ ప్రతిపాదన చేసారా.. లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. కాగా.. ఈ వ్యవహారం పైన జరుగుతున్న చర్చతో ఏపీలో ముఖ్య నేతల పార్టీ మార్పుల పైన చర్చ మాత్రం తెర మీదకు వచ్చింది. దీంతో.. రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాల పైన ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications