చావు బతుకుల్లో వైఎస్ జగన్ సోదరుడు అభిషేక్ రెడ్డి.. టీడీపీ షాకింగ్ పోస్టుతో చర్చ!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి అధికారం కోల్పోవడంతో ప్రస్తుతం వైఎస్ జగన్ టార్గెట్ గా ఎన్డీఏ కూటమి నేతలు విరుచుకుపడుతున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా జగన్ ను టార్గెట్ చేస్తూ మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇక తాజాగా వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డికి సోదరుడి వరసయ్య వైఎస్ అభిషేక్ రెడ్డి ఆరోగ్యం పైన జగన్ టార్గెట్ గా విమర్శలు వర్షం కురుస్తోంది.
వివేకానంద రెడ్డి హత్యకేసు తో సంబంధం ఉన్నవాళ్లు ఆకస్మిక మరణాలు
అంతుచిక్కని అనారోగ్యంతో అభిషేక్ రెడ్డి విషమ పరిస్థితిలో ఆసుపత్రిలో ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ చేసింది. అయితే టిడిపి చేసిన పోస్టులో వివేకానంద రెడ్డి హత్యకేసు తో సంబంధం ఉన్నవాళ్లు ఒక్కొక్కరుగా ఆకస్మికంగా చనిపోతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. వివేకానంద రెడ్డి హత్య కేసు వివరాలు తెలిసిన వారంతా అనుమానాస్పద స్థితిలో చనిపోతున్నారని టిడిపి అధికారిక ఖాతాలో ఆరోపించింది.

గొడ్డలిపోటు రహస్యాలు తెలిసిన ఒక్కొక్కరి కథ విషాదాంతం
నాడు జగన్ మామ గంగిరెడ్డి, నేడు అభిషేక్ రెడ్డి అంటూ తెలుగుదేశం పార్టీ చేసిన ట్వీట్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బాబాయ్ వివేకానంద రెడ్డి పై అబ్బాయిల గొడ్డలి పోటుని గుండెపోటుగా చిత్రీకరించిన ఒక్కొక్కరు అనుమానస్పదంగా మృతి చెందుతున్నారని ఆ పోస్టులో పేర్కొంది. వారంతా అంతుపట్టని అనారోగ్యానికి గురవుతున్నారని గొడ్డలిపోటు రహస్యాలు తెలిసిన ఒక్కొక్కరి కథ విషాదాంతంగా ముగుస్తోందని తెలుగుదేశం పార్టీ పోస్ట్ పెట్టింది.
బాబాయ్ వివేకానంద రెడ్డిపై అబ్బాయిల గొడ్డలి పోటుని, గుండెపోటుగా చిత్రీకరించిన ఒక్కొక్కరు అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారు. అంతుపట్టని అనారోగ్యానికి గురవుతున్నారు. గొడ్డలి పోటు రహస్యాలు తెలిసిన ఒక్కొక్కరికి కథ విషాదాంతంగా ముగుస్తోంది. నాడు జగన్ మామ గంగిరెడ్డి.. నేడు అభిషేక్ రెడ్డి… pic.twitter.com/LPLbSzAzhn
— Telugu Desam Party (@JaiTDP) September 13, 2024
నాడు జగన్ మామ గంగిరెడ్డి.. నేడు జగన్ సోదరుడు అభిషేక్ రెడ్డి
నాడు జగన్ మామ గంగిరెడ్డి.. నేడు అభిషేక్ రెడ్డి అంటూ పోస్ట్ చేసిన టిడిపి వివేకానంద రెడ్డిని హతమార్చిన తర్వాత కుట్లు వేసిన దాంట్లో సహాయపడిన తమ్ముడు అభిషేక్ రెడ్డి చావు బతుకుల్లో ఉన్నాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. సిబిఐ వారు ఈ కేసును తొందరగా తేల్చకపోతే ఇందులో సాక్షులని, నిందితులని ఎవరిని మిగల్చరని పోస్ట్ చేయడం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
వివేకా హత్యకేసుపై చర్చ
వైఎస్ జగన్ తన తమ్ముడు చావు బతుకుల్లో ఉన్నా పరామర్శించలేదని వ్యాఖ్యలు చేయటంతో పాటు, వివేకా హత్యకేసు గుట్టు తెలిసిన వారే ఆకస్మిక మరణాలు పొందుతున్నారని, సీబీఐ కేసును త్వరగా తేల్చాలని టీడీపీ చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మళ్ళీ వివేకానందరెడ్డి హత్యకేసుపై ఏపీలో చర్చ మొదలైంది.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని












Click it and Unblock the Notifications