ప్రతిపక్ష హోదా లేకున్నా రేపే సభకు వస్తా, అయితే - జగన్ కీలక ప్రతిపాదన..!!
మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి హాజరు పైన తన వైఖరి స్పష్టం చేసారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం వేళ పార్టీ ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా జగన్ సమావేశం అయ్యారు. కీలక దిశా నిర్దేశం చేసారు. ఇప్పటికే స్పీకర్..సీఎం సైతం వైసీపీ సభకు హాజరు కావాలని సూచించారు. ఈ నేపథ్యంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రతిపక్ష హోదా లేకున్నా తాను సభకు రావటానికి సిద్ధమేనంటూ కొత్త ప్రతిపాదన చేసారు. ఇప్పుడు జగన్ ప్రతిపాదన ఆసక్తి కరంగా మారుతోంది.
కీలక మంత్రాంగం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభం అయ్యాయి. ఈ నెల 27వ తేదీ వరకు సభ నిర్వహణ పైన బీఏసీ నిర్ణయం తీసుకుంది. కాగా, మండలికి హాజరు అవుతున్న వైసీపీ.. అటు అసెంబ్లీకి గైర్హాజరు అవుతోంది. దీని పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సభకు హాజరు కాకుండా ఎమ్మెల్యేలు జీతాలు తీసుకొంటున్నారనే చర్చ జరుగుతోంది. ఈ సమయంలో పార్టీ ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. శాసనసభ, మండలిలో పార్టీ వ్యూహాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇస్తే సభకి వస్తానని..ప్రతిపక్ష హోదా లేకపోయినా సభలో మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని వ్యాఖ్యానించారు. సభలోని ఎమ్మెల్యేలందరితోపాటు సమయం ఇస్తామంటున్నారని చెప్పుకొచ్చారు. ఒక ఎమ్మెల్యేకు ఇచ్చినంత సమయం మాత్రమే ఇస్తామని చెబుతున్నారని... అలా అయితే ప్రజా సమస్యలను సవివరంగా ఎలా చెప్పగలం అంటూ జగన్ వ్యాఖ్యానించారు.

సభకు వస్తాను
సభలో అధికార కూటమి కాకుండా వైసీపీ మాత్రమే ప్రతిపక్షంగా ఉందని జగన్ గుర్తు చేసారు. కీలక అంశాల పైన మాట్లాడాలంటే సమయం ఇవ్వాలని పేర్కొన్నారు. సభలో సమయం ఇవ్వటం పైన స్పీకర్ వద్దకు మాట్లాడాలని కొందరు ఎమ్మెల్యేలకు జగన్ సూచించారు. "మీరు వెళ్లి స్పీకర్‌ని కలిసి అడగండి. ఆయన తగిన సమయం ఇస్తామంటూ హామీ ఇస్తే రేపే సభకు వస్తాను. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా పరవాలేదు. సమయం ఇవ్వమని కోరండి.. అంటూ సూచించారు. ప్రజా సమస్యలను లోతుగా వివరించేందుకు అసెంబ్లీలో సరైన అవకాశం లేకపోవడం వల్లే ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడుతున్నట్లు జగన్ తెలిపారు. వారు చెబుతున్న విధంగా సభకు వస్తే మాట్లాడే అవకాశం ఇస్తామని చెబుతారు. కానీ వాస్తవంగా సమయం ఇవ్వరు. అందుకే ఇక్కడ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయించామని చెప్పారు. అలాగే, ప్రతిపక్ష హోదా ఇవ్వడాన్ని కోర్టులో సవాలు చేశామని, కానీ స్పీకర్ కోర్టు సమన్లకు కూడా సమాధానం ఇవ్వడం లేదని ఆరోపించారు.
రాజీ పడద్దు
ఇక, అనర్హత వేటు పైనా జగన్ స్పందించారు. 60 రోజులు సభకు రాకపోతే అనర్హత వేటు వేస్తామని చెబుతున్నారు. కానీ చంద్రబాబు సభకు రాకపోయినా వేటు పడిందా అని జగన్ ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగానికి, ఉమ్మడి సమావేశానికి హాజరవుతున్నామని చెప్పుకొచ్చారు. తన వల్ల ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లడం ఆగాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎవరైనా వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చని.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందుకు వచ్చి ఎమ్మెల్యేలని సభకు తీసుకెళ్లాలని అనుకుంటే తాను ఆపనని జగన్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీలకు జగన్ ప్రత్యేక సూచనలు చేశారు. శాసనమండలిలో మన బలం ఎక్కువ ఉందని... ప్రభుత్వ వైఫల్యాలను ఎండ గట్టాలి, ఈ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని సూచించారు. మెడికల్ కాలేజీలు ప్రజలకు చెందిన తరతరాల ఆస్తి, చంద్రబాబు వాటిని అమ్మేస్తున్నారని... దీన్ని కచ్చితంగా అడ్డుకోవాలని సూచించిన జగన్.. ప్రజలతో కలిసి పోరాటం చేయాలని నిర్దేశించారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications