Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైకోర్టు, సుప్రీంకోర్టుకు కోడి కత్తి శ్రీను అభ్యర్ధనలు- ఏం జరగబోతోంది?

ఏపీలో గత ఎన్నికలకు ముందు అప్పటి విపక్ష నేత, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడికత్తి దాడి కేసు అనేక మలుపులు తిరుగుతోంది. అయితే ఈ దాడికి పాల్పడ్డ నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ కు మాత్రం బెయిల్ లభించడం లేదు. దీంతో దాదాపు ఐదేళ్లుగా బెయిల్ లేకుండా రిమాండ్ ఖైదీగా అతను జైల్లో మగ్గిపోతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్ఐఏ కోర్టు సెప్టెంబర్ 22న తనకు బెయిల్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాడు.

కోడికత్తి కేసు నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. కౌంటర్లు దాఖలు చేయాలని ఎన్ఐఏతో పాటు ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇవి అందిన తర్వాత తదుపరి విచారణ జరిపి జనిపల్లి శ్రీనివాస్ బెయిల్ పై నిర్ణయం తీసుకోబోతోంది. మరోవైపు ఈ కేసులో సీఎం జగన్ కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇస్తే సరిపోతుందని, కానీ జగన్ ముందుకు రాకపోవడంతో శ్రీనుకు బెయిల్ రావడం లేదని అతని కుటుంబం, లాయర్ ఆరోపిస్తున్నారు.

ys jagan cock knife case accused srinu approached hc for bail, ask nia court to write to cji

మరోవైపు కోడికత్తి దాడి తర్వాత అరెస్టు అయిన తాను ఐదేళ్లుగా జైల్లో రిమాండ్ ఖైదీగా మగ్గిపోతున్నానని, తన కేసులో జోక్యం చేసుకుని విముక్తి కల్పించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ను కోరేందుకు జనిపల్లి శ్రీనివాస్ సిద్ధమయ్యాడు. ఈ కేసులో తనకు జరిగిన అన్యాయాన్ని సీజేకు వివరిస్తూ లేఖ రాసేందుకు అనుమతించాలని జనిపల్లి శ్రీను ఎన్ఐఏ కోర్టును కోరారు. దీంతో ఈ వ్యవహారంపై విశాఖ ఎన్ఐఏ కోర్టు ఏ నిర్ణయం తీసుకోబోతోందన్నదీ ఆసక్తిగా మారింది.

హైకోర్టులో దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ మన్నించినా, లేక సీజేఐకి లేఖ రాసేందుకు ఎన్ఐఏ కోర్టు అనుమతించి ఆయన జోక్యం చేసుకున్నా ఐదేళ్లుగా జైల్లో ఉన్న కోడికత్తి శ్రీను బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండూ కాకుండా వైఎస్ జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇచ్చినా సరిపోతుంది. ఈ మూడింటిలో ఏదో ఒకటి తప్పనిసరిగా జరుగుతుందని శ్రీను ఆశాభావంగా ఉన్నాడు. అసలే ఎన్నికల వేళ శ్రీను బెయిల్ పై బయటికి వస్తే రాజకీయంగా ఇబ్బందులు తలెత్తవచ్చని వైసీపీ అంచనా వేస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+