వీరజవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ.. రూ.25 లక్షల ఆర్ధికసాయం!
ఏపీ మాజీ సీఎం, వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ సింధూర్ లో భాగంగా శత్రు మూకలపై వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన వీరజవాన్ ముడావత్ మురళి నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. గోరంట్ల మండలం కల్లి తండాలో పర్యటించిన ఆయన దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ మురళి నాయక్ తల్లిదండ్రులైన శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయ్ ని పరామర్శించారు.వారు ధైర్యంగా ఉండాలని చెప్పారు.
మురళి నాయక్ అందరికీ స్ఫూర్తిదాయకం: వైఎస్ జగన్
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దేశం కోసం పోరాడుతూ మురళి నాయక్ వీరమరణం పొందారని, మురళి నాయక్ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉందని పేర్కొన్నారు. మురళి నాయక్ అందరికీ స్ఫూర్తిదాయకమని జగన్ పేర్కొన్నారు. మురళి నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం అని వైసిపి అధినేత జగన్ చెప్పారు.

మురళి నాయక్ కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మురళి నాయక్ కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మురళి నాయక్ కుటుంబానికి అండగా ఉంటుందని వైయస్ జగన్ పేర్కొన్నారు. జవాన్ చనిపోతే 50 లక్షల రూపాయలు ఇచ్చే సంప్రదాయం తమ ప్రభుత్వం ప్రారంభించిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అదే విధానాన్ని కొనసాగిస్తుందని వైయస్ జగన్ గుర్తు చేశారు.
అధికార అంచనాలతో మురళి నాయక్ అంత్యక్రియలు
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ మురళి నాయక్ కుటుంబానికి తమ వంతుగా సహాయం చేస్తామని, అందుకే వైసీపీ తరఫున 25 లక్షల రూపాయలు ప్రకటించినట్టుగా ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే నిన్న వీర జవాన్ మురళి నాయక్ అంత్యక్రియలు అధికార అంచనాలతో నిర్వహించారు. ప్రభుత్వం తరఫున వీరి కుటుంబానికి 5 ఎకరాల పొలం, 50 లక్షల రూపాయల నగదు, ఇంటి స్థలం, తండ్రికి ఉద్యోగం ప్రకటించారు.
అధికార లాంఛనాలతో మురళీ నాయక్ అంత్య క్రియలు
వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ 25 లక్షల రూపాయల సాయాన్ని ప్రకటించారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తదితరులు కల్లి తండాకు చేరుకుని మురళి నాయక్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఇక నేడు వారి కుటుంబాన్ని వైయస్ జగన్ పరామర్శించి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.












Click it and Unblock the Notifications