వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెన్త్‌, ఇంటర్ పరీక్షలపై జగన్‌ ఫస్ట్‌ రియాక్షన్- విద్యార్ధుల భవిష్యత్తుకే- విమర్శలపై ఫైర్‌

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఓవైపు కరోనా విజృంభణ సాగుతుండగా.. పదోతరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా విద్యార్ధుల తల్లితండ్రుల్లో నెలకొన్న భయాల్ని పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకెళ్తోందంటూ విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. దీనిపై సీఎం జగన్ ఇవాళ స్పందించారు. తొలిసారిగా పదోతరగతి, ఇంటర్ పరీక్షలపై మాట్లాడిన జగన్‌... విపక్షాలకు ఓ రేంజ్‌లో కౌంటర్‌ ఇచ్చారు. దీంతో జగన్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

Recommended Video

#ap #10thexams విద్యార్థుల భవితను ఆలోచించే ప‌రీక్ష‌లు-సీఎం జ‌గ‌న్
పది, ఇంటర్‌ పరీక్షలపై జగన్ ఫస్ట్‌ రియాక్షన్

పది, ఇంటర్‌ పరీక్షలపై జగన్ ఫస్ట్‌ రియాక్షన్


ఏపీలో పదోతరగతి, ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఓవైపు కరోనా విజృంభణ కొనసాగుతున్న సమయంలోనే కీలక పరీక్షల నిర్వహణపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఇరుకునపడుతోంది. ఇప్పటివరకూ పరీక్షలపై కానీ, విపక్షాల విమర్శలపై కానీ మాట్లాడని సీఎం జగన్ తొలిసారిగా ఇవాళ స్పందించారు. కీలకమైన పదో తరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరాన్ని సీఎం అందరికీ గుర్తు చేశారు.

పరీక్షలపై జగన్ కీలక వ్యాఖ్యలు

పరీక్షలపై జగన్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్ధుల భవిష్యత్తుకే నష్టమని సీఎం జగన్‌ అన్నారు. విద్యార్ధుల భవిష్యత్‌ గురించి నా కంటే ఎక్కువగా ఎవరూ ఆలోచించరని జగన్‌ తెలిపారు. పరీక్షలు నిర్వహించకుండా సర్టిఫికెట్లలో కేవలం పాస్‌ అని ఇస్తే భవిష్యత్తులో విద్యార్ధులు తీవ్రంగా నష్టపోతారని జగన్ పేర్కొన్నారు. పరీక్షలు నిర్వహించాలో వద్దో కేంద్రం.. రాష్టాలకే వదిలేసిందని జగన్ గుర్తు చేశారు. దీంతో పరీక్షల నిర్వహణపై రాజీ పడేది లేదని జగన్‌ మరోసారి తేల్చిచెప్పినట్లయింది.

విపక్షాలపై జగన్ ఫైర్‌

విపక్షాలపై జగన్ ఫైర్‌

ఏపీలో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై విపక్షాలు చేస్తున్న విమర్శలను సీఎం జగన్ తప్పుబట్టారు. పరీక్షలపై విమర్శలు సరికాదన్నారు. ప్రతీ విద్యార్ధి భవిష్యత్‌ కోసం తాను ఆలోచిస్తానని, విపత్కర పరిస్ధితుల్లో కూడా కొందరు విమర్శలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. అన్ని రాష్టాల్లో పరీక్షల నిర్వహణపై ఒ‍కే విధానం లేదని, కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయని జగన్ వెల్లడించారు. టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలపైనే విద్యార్ధుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, వాటిలో వచ్చే మార్కుల్ని బట్టే ఏ కాలేజీలో అయినా సీటు వస్తుందని చెప్పారు. అందుకే పరీక్షల నిర్వహణను బాద్యతగా తీసుకుంటామని, కోవిడ్‌పై పోరాటంలో కచ్చితంగా గెలుస్తామని జగన్‌ ప్రకటించారు.

English summary
andhra pradesh chief minister ys jagan on today strongly reacted on criticism over holding ssc and intermediate examinations in covid time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X