ఇక రాజన్న రాజ్యం: జగన్, చిరుకే సాధ్యం కాలేదన్న రోజా, పాదాభివందనమంటూ..

Subscribe to Oneindia Telugu
  చిరంజీవి ఏం పీకలేకపోయాడు, 2019 మాదే ?

  హైదరాబాద్/ఒంగోలు: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 8వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కేక్ కట్ చేశారు. ప్రస్తుతం ఆయన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.

  ఈ క్రమంలో జగన్ సోమవారం ఉదయం ఈపురుపాలెంలో నేతలు, కార్యకర్తల సమక్షంలో భారీ కేక్‌ కట్‌ చేసి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు.

  రాజన్న రాజ్యాన్ని తిరిగి తెస్తాం..

  ‘సరిగ్గా 8 ఏళ్ల క్రితం ఇదే రోజు విలువలతో కూడిన రాజకీయాలను అందించేందుకు.. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను నెరవేర్చేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పురుడు పోసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల హక్కుల సాధన కోసం అండగా నిలుస్తూ పోరాడుతూనే.. రాజన్న రాజ్యాన్ని తిరిగి తెస్తాం' అని ఆయన ట్వీట్‌ చేశారు.

  అందరికీ కృతజ్ఞతలు

  ఇక ఇంతకాలం పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలకు, తనకు అండగా నిలుస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వైయస్‌ జగన్‌ మరో ట్వీట్‌ చేశారు.

   ప్రజలే గెలిపిస్తారు

  ప్రజలే గెలిపిస్తారు

  వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆ పార్టీ కేంద్ర కార్యాలయంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. వైయస్సార్‌ ఆశయ సాధనకు వైయస్సార్‌సీపీని స్థాపించడం జరిగిందని.. అందుకు అనుగుణంగా కృషి చేద్దామని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాను ఎన్నికల తర్వాత పాలకులు మర్చిపోయారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో వైయస్సార్‌సీపీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పెద్ది రెడ్డి అన్నారు.

  పాదాభివందనం.. చిరంజీవి లాంటి వాళ్లే..

  పాదాభివందనం.. చిరంజీవి లాంటి వాళ్లే..

  అనంతరం ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ.. ఏడేళ్లుగా పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలకు పాదాభివందనమన్నారు. చిరంజీవి లాంటి వాళ్ళు పార్టీ పెట్టి నడపలేక చేతులు ఎత్తేశారని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు.

  ‘మాదే అధికారం-జననేత జగనే సీఎం': ఢిల్లీలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ వేడుకలు

   2019లో అధికారం ఖాయం

  2019లో అధికారం ఖాయం

  వైయస్సార్‌సీపీని పురిటిలోనే తొక్కేయాలని ప్రయత్నాలు చేశారని రోజా తెలిపారు. రావడం లేటు కావొచ్చు కానీ.. 2019 లో వైయస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం వైయస్‌ జగన్‌ చేస్తున్న ప్రత్యేక హోదా పోరాటాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ వేడుకల్లో భూమన కరుణాకర్‌ రెడ్డి, లక్ష్మీ పార్వతి, వాసిరెడ్డి పద్మ, తదితరులతో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  YS Jaganmohan reddy Cuts the Cake on Monday during YSRCP formation day celebrations.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి