విజయ్ కు వారి మద్దతు విత్ డ్రా, స్పీకర్ కు లేఖ- ఇక నెక్స్ట్..!?
తమిళనాడు రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. అసెంబ్లీలో విజయ్ బల నిరూపణ తరువాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బల పరీక్ష సమయంలో అన్నాడీఎంకే చీలిక వర్గం విజయ్ కు మద్దతు ప్రకటించింది. దీంతో.. విజయ్ 144 ఎమ్మెల్యేల మద్దతు పొందారు. అయితే... మంత్రి వర్గ విస్తరణ తరువాత అన్నాడీఎంకే చీలక వర్గం యూ టర్న్ తీసుకుంది. అందులో నలుగురు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి.. అధికారికంగా టీవీకేలో చేరారు. మిగిలిన చీలిక వర్గం తాము టీవీకే కు మద్దతు ఇవ్వటం లేదంటూ స్పీకర్ కు లేఖ ఇచ్చేందుకు సిద్దమైంది.
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలిచిన మెజార్టీ సీట్లు రాలేదు. దీంతో.. కాంగ్రెస్ తో సహా మరో నాలుగు పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసారు. అసెంబ్లీలో బల పరీక్ష వేళ అన్నాడీఎంకే చీలిక వర్గానికి చెందిన 25 మంది మద్దతుగా నిలిచారు. వారు విజయ్ కేబినెట్ లో మంత్రి పదవు లను ఆశించారు. వారికి దక్కకపోవటంతో.. తిరిగి పళినిస్వామితో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వారి నుంచి నలుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి విజయ్ తో జత చేరారు. కాగా.. అన్నాడీఎంకే ఎన్నికల్లో 47 సీట్లు గెలవగా... పళినిస్వామికి 22 మంది.. చీలక వర్గం షణ్ముగం కు మద్దతుగా 25 మంది నిలిచారు. ఈ 28 మంది విజయ్ కు మద్దతు ప్రకటించారు. ఇప్పుడు వీరు తిరిగి పళినిస్వామితో రాజీకి సిద్దమయ్యారు. తాజాగా జరిగిన చర్చల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

తమిళనాట వేగంగా మారుతున్న రాజకీయం
అన్నాడీఎంకేలో రెండు వర్గాలు తిరిగి కలిసి పని చేసే అవకాశం కనిపిస్తోంది. తాజాగా జరిగిన ఒప్పందం మేరకు బల పరీక్ష సమయంలో విజయ్ కు మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని ఈపీఎస్ వర్గం ఇచ్చిన ఫిర్యాదులను వెనక్కు తీసుకోనుంది. అదే విధంగా విజయ్ కు తాము మద్దతు ఇస్తూ ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోవాలని చీలక వర్గం నేతలు నిర్ణయించారు. దీంతో.. విజయ్ తిరిగి 118 స్థానాల మద్దతుతో ప్రభుత్వం కొనసాగించనున్నారు. ఇప్పటికే తిరుచ్చి సీటుకు విజయ్ రాజీనామా చేసారు. తాజాగా అన్నాడీఎంకే నుంచి నలుగురు రాజీనామా చేయటం తో అయిదు స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. ఈ నలుగురు అన్నాడీఎంకే గుర్తుపై గెలవగా.. ఇప్పుడు టీవీకే గుర్తుతో పోటీ చేయనున్నారు. వీరికి ఓటర్ల నుంచి ఆదరణ లభిస్తుందా అనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఫలితంలో తేడా వస్తే ఆరు నెలల కాలం లోనే విజయ్ సర్కార్ ఇరకాటంలో పడటం ఖాయమనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో.. తమిళనాట చోటు చేసుకునే రాజకీయంగా పైన ఉత్కంఠ కొనసాగుతోంది.













Click it and Unblock the Notifications