జగన్ గోల్డెన్ ఛాన్స్ మిస్- బిగ్ మిస్టేక్..!!
మాజీ సీఎం జగన్ నిర్ణయం సరి కాదా. సొంత పార్టీలోనే జగన్ నిర్ణయం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చెబుతున్న జగన్ దానికి తనకు అనుకూలంగా మలచుకునే అవకాశాలను వదులుకుంటున్నారనే చర్చ పార్టీలో వినిపిస్తోంది. జగన్ జిల్లాల పర్యటన ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో జగన్ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్నారనే అభిప్రాయం పార్టీలో వినిపిస్తోంది. తన రాజకీయ మూలాలు మర్చిపోతున్నారనే చర్చ కొనసాగుతోంది.
జగన్ నిర్ణయంతో
మాజీ సీఎం జగన్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు హాజరయ్యారు. జగన్ ఇక సభకు వస్తారని అందరూ భావించారు. గవర్నర్ ప్రసంగం సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష హోదా కోసం నిరసన తెలిపి.. ఆ వెంటనే అందరూ అసెంబ్లీ వాకౌట్ చేసారు. జగన్ చేస్తున్న డిమాండ్ అమలు పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పార్లమెంట్ , ఏపీ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్ణయాలను గుర్తు చేస్తున్నారు. అయితే, కూటమి నేతలు మాత్రం ఈ అయిదేళ్లు కాలంలో జగన్ కు ప్రతిపక్ష హోదా రాదని తేల్చి చెబుతున్నారు. ఇదే విషయాన్ని పవన్ స్పష్టం చేసారు. కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలల కాలంలో సూపర్ సిక్స్ లో కీలక హామీలను అమలు చేయ లేదు.

2014-19 లో జగన్
పథకాల పైన ప్రజల్లో చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష హోదా కోసం జగన్ న్యాయ పోరాటం చేస్తు న్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉన్న సమయంలో సభకు హాజరై..ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాన్ని జగన్ వదులుకున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తనకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వరనేది జగన్ వాదన. అయితే, జగన్ కు మాట్లాడేందుకు మైక్ ఇవ్వకపోయినా.. అధికార పార్టీ నుంచి ఎలాంటి ప్రతికూల స్పందన కనిపించినా.. రాజకీయంగా జగన్ కే కలిసి వస్తుందని వైసీపీ నేతలు అంతర్గత చర్చల్లో అంగీకరిస్తున్నారు. 2014 ఎన్నికల్లో 67 సీట్లు గెలిచిన జగన్ నాడు ప్రతిపక్ష పాత్ర పోషించారు. సభలో తన వాదన సమర్ధవంతంగా వినిపించారు. సభలో తనకు మాట్లాడే అవకాశం దక్కటం లేదని ప్రజలు గ్రహించే లా చేసి..ఆ తరువాత ప్రజల్లోకి వెళ్లటం ద్వారా మద్దతు లభించింది.
అవకాశం వదులుకుంటున్నారా
జగన్ కు సభలో ఎలాంటి పరి స్థితులనైనా ఎదుర్కోవటం కొత్త కాదని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నా రు. జగన్ ను రాజకీయంగా ఇబ్బంది పెట్టారనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం ద్వారానే ప్రజల్లో అంతగా ఆదరణ పెరిగింది. ఆ మూలాలను పార్టీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు. జగన్ సభకు హాజ రు కాకుండా బయట మీడియా సమావేశాలు నిర్వహించటం ద్వారా ప్రజల్లో సానుకూలత రాదనే అభి ప్రాయం వినిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన సభలో నిలదీ సే అవకాశం గోల్డెన్ ఛాన్స్ జగన్ మిస్ చేసుకున్నారనే అభిప్రాయం నెలకొంది. బడ్జెట్ పైన సభలో చర్చ జరిగే సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు సైతం హాజరు కాకపోవటం పైన విమర్శలు వినిపిస్తున్నాయి. మరి.. జగన్ తన వైఖరి మార్చుకుంటారా.. లేక, దీనిని కొనసాగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications