Ys Jagan: జగన్ కూ తుపాన్ సెగ..! లాస్ట్ మినిట్ లో కీలక నిర్ణయం..!
ఏపీలో మొంథా తుపాన్ తీవ్ర రూపం దాలుస్తోంది. ఇప్పటికే కోస్తా జిల్లాల్లో చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు మొదలయ్యాయి. ఇవాళ సాయంత్రం లేదా రాత్రికే తుపాను కాకినాడ వద్ద తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ జనజీవనంపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. రాజకీయ నాయకులూ ఇందుకు మినహాయింపు కాదు. ఇదే క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూ తుపాను సెగ తగిలింది.
ఇవాళ బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి గన్నవరం వచ్చేందుకు వైఎస్ జగన్ సిద్దమయ్యారు. అయితే తుపాను నేపథ్యంలో బస్సులు, రైళ్లతో పాటు విమానాల రాకపోకలు కూడా ప్రభావితం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ వెళ్లాల్సిన విమానం రద్దయింది. దీంతో జగన్ తాడేపల్లికి తన ప్రయాణాన్ని చివరి నిమిషంలో రద్దు చేసుకోవాల్సి వచ్చింది. తుపాను కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయస్.జగన్ తాడేపల్లి ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. తుపాను ప్రభావంతో గన్నవరం విమానాశ్రయానికి విమాన సర్వీసులు రద్దుచేశారు. విమాన సర్వీసులు పునరుద్ధరిస్తే రేపు జగన్ బెంగళూరు నుంచి బయలుదేరి గన్నవరానికి వస్తారని పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగన్ ఇప్పటికే విజ్ఞప్తిచేశారు. ముందుజాగ్రత్త, సహాయ పునరావాస చర్యల్లో ప్రజలకు తోడుగా నిలవాలని పార్టీ శ్రేణులకు, నాయకులకు ఆయన ఇప్పటికే పిలుపునిచ్చారు.

ఏపీలో మొంథా తుపాను ప్రభావం నేపథ్యంలో అధికారులు చేపడుతున్న కార్యక్రమాలకు అండగా నిలవాలని వైసీసీ ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ శ్రేణులకు కీలక సందేశాలు పంపుతోంది. ఓవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కల్తీ మద్యం, ఇతర అంశాలపై జోరుగా క్షేత్రస్దాయిలలో పోరాటాలు చేస్తున్న సమయంలో ఇలా తుపాను రావడం, దాని ప్రభావం కూడా తీవ్రంగా ఉండటంతో అవన్నీ నిలివేసి ఇప్పుడు సహాయ చర్యలపైనే ఫోకస్ పెట్టింది.












Click it and Unblock the Notifications