రద్దు: టీడీపీపై శివాలెత్తిన జగన్! సంతోషం..భయం: చారి

హైదరాబాద్: మున్సిపల్, జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పోరేషన్ మేయర్‌ల ఎన్నికలలో మెజార్టీ సాధించేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన సభ్యులను అపహరించి, ప్రలోభాలకు గురి చేసిన తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం డిమాండ్ చేశారు.

ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు. ఈ లేఖను పార్టీ సీనియర్ నేత మైసూరా రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డికి అందజేశారు.

సంతోషం.. భయం!

YS Jagan demands to cancel TDP recognition

తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన వారు ఎంత బాధ్యతగా వ్యవహరించారో, అదే స్థాయిలో ఇప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామా లేదా అని ఒక్కోసారి భయం వేస్తుందని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి అన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో జరిగిన తెలంగాణ పోరాటం ఒక అనిర్వచనీయమైన అనుభవమని, ఆయన ఒక్క పిలుపు ఇస్తే జనం ఏక కాలంలో రోడ్ల పైకి వచ్చేవారని, ప్రపంచంలో ఇటువంటి ఉద్యమం మరొకటి లేదన్నారు.

బుధవారం అసెంబ్లీ ఉద్యోగులు.. కమిటీ హాలులో స్పీకర్‌తో పాటు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్ రావు, మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, డిప్యూటీ చైర్మన్‌ విద్యాసాగర్ రావు, డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్ రెడ్డి తదితరులను సన్మానించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటుతో ఒక అంకం ముగిసిందని, ఇప్పుడు నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+