ఏపీలో పాలనపై ఢిల్లీ వేదికగా జగన్ సంచలన కామెంట్స్..!!
టీడీపీ కూటమి ప్రభుత్వం పై జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేసారు. ఏపీలో దాడులకు నిరసనగా ఢిల్లీలో జగన్ పార్టీ శ్రేణులతో దీక్షకు దిగారు. అధికార మార్పిడి జరిగిన తరువాత చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆరోపించారు. దాడులు..దైర్జన్యాలతో పాలన సాగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పారు. బాధితుల పైనే కేసులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు.
ఏపీలో శాంతిభద్రతలు లేవని మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు. ఢిల్లీలో ఆయన ఏపీలో చంద్రబాబు పాలన పైన సంచలన ఆరోపణలు చేసారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని విమర్శించారు. లోకేష్ రెడ్ బుక్ పెట్టుకొని తనకు నచ్చని వారి పైన కక్ష సాధిస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ హోర్డింగ్ లు ఏర్పాటు చేసారన్నారు. రెండ్ బుక్ లో పేర్లు ఉన్నాయంటూ రాజకీయ నేతలు, అధికారులను వేధిస్తున్నారన్నారు. బాధితుల పైనే పోలీసులు కేసులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత 30 మందికి పైగా వైసీపీ కార్యకర్తల హత్య జరిగిందని చెప్పారు.

వందల ఇళ్లను ధ్వంసం చేసారని..గిట్టని వారి పంటలు ధ్వంసం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మేము అధికారంలో ఉన్న సమయంలో ఈ విధంగా దాడులను ప్రోత్సహించలేదని జగన్ వివరించారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే సందేహం కలుగుతోందన్నారు. ఏపీలో పరిస్థితులు వివరించేందుకు రాష్ట్రపతి, ప్రధాని అప్పాయింట్ మెంట్ కోరామన్నారు. తమ దీక్ష ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వీడియో, ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా ఏపీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్దం అవుతుందని చెప్పుకొచ్చారు. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని జగన్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications