పార్టీ వీడుతామన్న ఎంపీలకు తేల్చి చెప్పిన జగన్..!!
వైసీపీలో రాజీనామాల పరంపర కొనసాగుతోంది. ఇద్దరు రాజ్యసభ సభ్యులు..ముగ్గురు ఎమ్మెల్సీలు ఇప్పటికే రాజీనామా చేసారు. మరి కొందరితో టీడీపీ నేతలు టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ముగ్గురు రాజ్యసభ సభ్యులు తాము జగన్ తోనే కొనసాగుతామని ప్రకటించారు. పార్టీని నేతలు వీడుతున్న సమయంలో జగన్ అప్రమత్తం అయ్యారు. కీలక నేతలలో మంతనాలు చేసారు. పులివెందులకు వస్తున్న జగన్ పార్టీని నేతల వీడటం పైన తన వైఖరి ఏంటో తేల్చేసారు.
జగన్ మంతనాలు
పార్టీకి ఎంపీలు మోపిదేవి వెంటకరమణ, బీదా మస్తాన రావు రాజీనామాల పైన పార్టీ ముఖ్య నేతలతో జగన్ చర్చించారు. మరో ముగ్గురు ఎంపీలు సైతం అదే బాటలో ఉన్నారనే సమచారం పైన ఆరా తీసారు. జగన్ తో చర్చల తరువాత తాము పార్టీ వీడటం లేదని పిల్లి బోస్, రఘునాధ రెడ్డి, ఆర్ క్రిష్ణయ్య ప్రకటించారు. పార్టీకి రాజ్యసభకు రాజీనామా చేస్తే ఉప ఎన్నికల్లో ఆ పదవులు టీడీపీకి వెళ్తాయని జగన్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. రాజ్యసభ పదవులు వదులుకొని టీడీపీ ఇచ్చే పదవులతో ఏంటి ప్రయోజనం అని ప్రశ్నించినట్లు సమాచారం.

భవిష్యత్ ఉంటుంది
పార్టీ వీడాలనే ఆలోచనతో ఉన్నవారితో మాట్లాడాలని ఇద్దరు ముఖ్య నేతలకు జగన్ సూచించారు. వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చామని..ఓటమితో అంతా అయిపోలేదని వ్యాఖ్యానించారు. తిరిగి పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పినట్లు పార్టీ నేతల సమాచారం. మోపిదేవి నిర్ణయం పైన జగన్ మనస్థాపానికి గురైనట్లు చెబుతున్నారు. జగన్ తో చర్చల తరువాత బోస్ మీడియా ముందుకు వచ్చారు. తాము జీవితాంతం జగన్ వెంటే ఉంటామన్నారు. తనకు వ్యక్తిగతంగా నష్టాలు, కష్టాలూ ఉన్నా వైసీపీని వీడడం లేదని.. రాజ్యసభకు రాజీనామా చేయడం లేదని అయోధ్యరామిరెడ్డి చెప్పారు.
పులివెందులలో బస
గొల్ల బాబూరావు, రఘునాథరెడ్డి కూడా పార్టీని వదిలివెళ్లరని అన్నారు. తాము తనతోనే ఉంటారనే విషయం చెప్పాలని జగన్ సూచించారని బోస్ వెల్లడించారు. తాము రాజ్యసభకు రాజీనామా చేస్తే ఆ పదవులు టీడీపీకి వెళ్లిపోతాయని.. అది ఒక విధంగా జగన్‌కు వెన్నుపోటు పొడవడంతో సమానమని వ్యాఖ్యానించారు. ఇటు ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేసారు. ఈ రోజు నుంచి జగన్ పులివెందులలో ఉండనున్నారు. సోమవారం (సెప్టెంబరు 2న) తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయ ఘాట్‌లో నివాళులు అర్పిస్తారు.












Click it and Unblock the Notifications