ఆనం విజయ్ చేరిక: 'ఆనం కుటుంబంలో చిచ్చు పెట్టిన వైయస్ జగన్'
నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి.. ఆనం కుటుంబంలో చిచ్చు పెట్టారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం నాడు మండిపడ్డారు.
ఆనం విజయ్ కుమార్ బుధవారం నాడు టిడిపిలో చేరిన విషయం తెలిసిందే. దీనిపై సోమిరెడ్డి మాట్లాడారు. చంద్రబాబును తిట్టేందుకే ఆ చేరిక సభ పెట్టారన్నారు. జగన్ తండ్రి, రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి ఇందిరా కాంగ్రెస్ తరఫున సభలో అడుగు పెట్టారని విమర్శించారు.
జగన్ విశ్వసనీయత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వెన్నుపోటు పొడిచారన్నారు.

కాగా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆనం విజయ్ కుమార్ బుధవారం వైసిపిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన, ఆయన అనుచరులు పార్టీ అధినేత జగన్ సమక్షంలో వైసిపిలో చేరారు. ఈ సందర్భంగా జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
రాజకీయాల్లో విశ్వసనీయత లేకుంటే పెళ్లాం కూడా వెంట నడవదన్నారు. ప్రతిపక్షమంటే ప్రజల గోంతు అన్నారు. ప్రజల గొంతు వినిపించకుండా కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో విశ్వసనీయత, వ్యక్తిత్వం అవసరమని చెప్పారు.
ఎన్నికలకు ముందు అబద్దాలు చెప్పి చంద్రబాబు రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేశారన్నారు. ఎన్నికలప్పుడు చెప్పిన మాటలను కూడా చంద్రబాబు నెరవేర్చడం లేదన్నారు. ప్రజా బలం ఉన్నంత వరకు తనకు ఎలాంటి భయం లేదని చెప్పారు. ఎన్నీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. బ్రిటిష్ సామ్రాజ్యం, హిట్లర్ వంటి వారే కూలిపోయారన్నారు.












Click it and Unblock the Notifications