జగన్ నా పసుపుకుంకుమాలు పోగొట్టాడు: పరిటాల సునీత నిప్పులు
వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వల్ల నాతో సహా ఎంతోమంది తమ పసుపు కుంకుమాలు కోల్పోయారని ఏపీ మంత్రి పరిటాల సునీత గురువారం నాడు ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వల్ల నాతో సహా ఎంతోమంది తమ పసుపు కుంకుమాలు కోల్పోయారని ఏపీ మంత్రి పరిటాల సునీత గురువారం నాడు ఆవేదన వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లాలో పత్తికొండ వైసిపి ఇంచార్జ్ నారాయణ రెడ్డి హత్యపై టిడిపి - వైసిపి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నారాయణ రెడ్డి హత్య వెనుక టిడిపి నేతల హస్తం ఉందని జగన్ సహా వైసిపి నేతలు ఆరోపించారు.

దీనిని టిడిపి నేతలు కొట్టి పారేస్తున్నారు. జగనే ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తారని మండిపడుతున్నారు. తాజాగా పరిటాల సునీత స్పందించారు. జగన్ వల్ల తన పసుపు కుంకుమాలు పోయాయన్నారు. జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications