YS Jagan ఎన్నికల సమరశంఖం నేడే: "మేమంతా సిద్ధం" 21రోజులపాటు; నేడు షెడ్యూల్ ఇలా!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు దూకుడుగా ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసిపి ఎన్నికల ప్రచారాన్ని తనదైన పంధాలో కొనసాగిస్తోంది. ఇప్పటికే సిద్ధం సభలతో అదరగొట్టిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నేటి నుంచి ఎన్నికల ప్రచార శంఖారావానికి శ్రీకారం చుడుతున్నారు.

"మేమంతా సిద్ధం" బస్సు యాత్రలతో ఎన్నికల సమరభేరి మోగించనున్నారు. నేటి నుండి మొత్తం 21 రోజులపాటు ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు ఈ బస్సు యాత్రను కొనసాగిస్తారు. ఇప్పటికే నాలుగు పార్లమెంటు నియోజకవర్గాలలో సిద్ధం సభలను నిర్వహించగా, మిగిలిన పార్లమెంటు నియోజకవర్గాలలో మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలను కొనసాగించనున్నారు.

YS Jagan Election campaign starts Today memantha siddham bus yatra For 21 Days Today schedule

నేడు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్న జగన్ తొలుత ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, తర్వాత బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తొలి రోజు బస్సుయాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గం లో జరుగుతుంది. ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ విషయానికి వస్తే తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి ఒంటిగంటకు ఇడుపులపాయకు చేరుకుంటారు.

వైయస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన తర్వాత మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాలకు బస్సు యాత్రను ప్రారంభిస్తారు . ఇడుపులపాయ నుంచి కుమారుని పల్లి, వేంపల్లి, సర్వ రాజుపేట, వీరపునాయునిపల్లి, గంగిరెడ్డి పల్లి, ఉరుటూరు, యర్రగుంట్ల మీదుగా సాయంత్రం నాలుగున్నర గంటలకు పొద్దుటూరు బైపాస్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు బస్సు యాత్ర చేరుకుంటుంది. ఇక్కడ బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తారు.

బహిరంగ సభ అనంతరం మళ్లీ బస్సు యాత్ర సున్నపురాళ్లపల్లె, దువ్వూరు, జిల్లెల, నాగలపాడు, బోధనం, చాగలమర్రి మీదుగా, రాంపల్లె క్రాస్ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన శిబిరం వద్దకు చేరుకుంటుంది. రాత్రికి జగన్ అక్కడే బస చేస్తారు.

మొత్తం 21 రోజుల పాటు సాగనున్న ఈ బస్సు యాత్రలో ప్రతిరోజు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన రూట్ మ్యాప్ ఉంది. ఈసారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న క్రమంలోనే వైయస్ జగన్ విజయమే లక్ష్యంగా అన్ని నియోజకవర్గాలను కవర్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+