ఇక నుండి ప్రతి శుక్రవారం జగన్ కోర్టుకు వెళ్ళాల్సిందే.. హ్యాపీ ఫ్రైడే జగనన్నా.. ట్రోల్స్!!
నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హల్చల్ చేసిన వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఏపీ ప్రజలు చిత్తుగా ఓడించారు. ఊహించని విధంగా టిడిపి కూటమికి అఖండ విజయాన్ని అందించారు. వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసి వైసీపీ పాలన మాకు అక్కర్లేదు అని తేల్చి చెప్పారు.
జగన్ కు షాక్ ఇస్తున్న ఏపీ వాసులు
ఇక ఇప్పటికే ఎన్నికల ఫలితాలతో జగన్ కు షాక్ ఇచ్చిన ఏపీ ప్రజలు, సోషల్ మీడియాలోనూ జగన్ ను వదిలిపెట్టడం లేదు. జగన్ ను తీవ్రంగా వ్యతిరేకించే కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇక నుంచి మళ్లీ జగన్మోహన్ రెడ్డికి శుక్రవారం వచ్చిందంటే దడే అంటూ జగన్ పై ఉన్న కేసులను గుర్తు చేస్తున్నారు.

జగన్ సీబీఐ కేసులపై చర్చ
అక్రమాస్తుల కేసులో సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇకపై కోర్టుకు హాజరు అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రిగా పరిపాలనాపరమైన బాధ్యతల కారణంతో ఆయన ఇన్నాళ్లు కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందుతూ వచ్చారని, అయితే ఇకపై అది నడవదని చర్చిస్తున్నారు.
మళ్ళీ సీబీఐ కోర్టుకు జగన్
ఎన్నికలలో వైసిపి అధికారం కోల్పోవడంతో జగన్ సీఎం పదవికి రాజీనామా చేయగా, ఇకపై ప్రతి శుక్రవారం నాంపల్లి సిబిఐ కోర్టులో జగన్ హాజరు కాక తప్పదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా జగన్ పైన మరోసారి రెచ్చిపోయిన ట్రోలర్లు నాడు అసెంబ్లీ ఉంది కోర్టుకు రాలేను.. నేడు కోర్టుకు వెళ్లాలి అసెంబ్లీకి రాలేను అంటూ జగన్ ను టార్గెట్ చేస్తున్నారు.
హ్యాపీ ఫ్రైడే జగనన్న
ఇకపై ప్రతి శుక్రవారం జగన్ ఎక్కడ ఉంటాడో తెలుసా అంటూ కేసుల్లో.. కోర్టుల్లో.. ఆపై చంచల్గూడ జైల్లో అంటూ జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. అంతేకాదు హ్యాపీ ఫ్రైడే జగనన్న అంటూ ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి ఏపీ ప్రజలు ఎన్నికల్లో ఓడించడమే కాకుండా, ఇంకా సోషల్ మీడియా వేదికగాను వైసీపీ ని టార్గెట్ చేస్తున్న తీరు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.












Click it and Unblock the Notifications