వైఎస్ జగన్ డైనమిక్ యంగ్ లీడర్ అన్న చిరంజీవి , చంద్రబాబు విషెస్, మహేష్ బాబు ట్వీట్

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి 48వ పుట్టినరోజు సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అభిమానులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా సీఎం జగన్ శుభాకాంక్షలు తెలుపుతున్న చాలామంది అభిమానులు సీఎం జగన్ పాలనను కొనియాడుతున్నారు. ఇక మరో ప్రక్క బర్త్ డే విషెస్ టు ఫేక్ సీఎం వైయస్ జగన్ అంటూ సోషల్ మీడియాలో జగన్ కు వ్యతిరేకంగా కూడా పోస్ట్ లు హల్ చల్ చేస్తున్నాయి.

 జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు

జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు

టిడిపి అధినేత,మాజీ సీఎం చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విటర్లో జగన్ కు శుభాకాంక్షలు తెలియజేసిన చంద్రబాబు "వైయస్ జగన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు, ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను" అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ కేంద్రమంత్రి, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి కూడా వైయస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు .

డైనమిక్ యంగ్ లీడర్ వైయస్ జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు : చిరంజీవి

డైనమిక్ యంగ్ లీడర్ వైయస్ జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు : చిరంజీవి

డైనమిక్ యంగ్ లీడర్ వైయస్ జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ పేర్కొన్న చిరంజీవి లక్ష్యాలను సాధించడంలో మీ సంకల్పం మీ పట్టుదల నిజంగా ప్రశంసనీయం అంటూ ట్విట్టర్ వేదికగా జగన్ పాలనను కొనియాడారు. అంతే కాదు ఎంతో సంతోషంగా అద్భుతంగా ఇంకో ఏడాది గడపాలి. మరెన్నో సంవత్సరాలు మీరు ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Recommended Video

    Andhra Pradesh : స్టేలు తెచ్చుకోకు.. ఏం పీకుతామో చూపిస్తాం - Chandrababu Naidu కి Perni Nani సవాల్
    మీ విజన్, మీ కృషి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని ఆకాంక్ష : మహేష్ బాబు

    మీ విజన్, మీ కృషి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని ఆకాంక్ష : మహేష్ బాబు

    గౌరవనీయులు సీఎం వైఎస్ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ విజన్, మీ కృషి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని ఆశిస్తున్నాను. ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వైయస్ జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక వీరు మాత్రమే కాకుండా పలువురు సినీ ప్రముఖులు , సినీ నటులు సీఎం జగన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. హీరో రవితేజ, మంచు విష్ణు, సుధీర్ వర్మ, హీరోయిన్ కాజల్ అగర్వాల్, నిర్మాత బండ్ల గణేష్, దర్శకుడు మలినేని గోపిచంద్ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+