జాగ్రత్త.. జగన్‌కు పారనోయ వ్యాధి, ఢిల్లీలో ఉంటే ప్రధానిని అనేవారు: దేవినేని

ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిన్న (గురువారం) ఢిల్లీలో ఉంటే తానే ప్రధానమంత్రిని అనేవాడేమోనని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు శుక్రవారం అన్నారు.

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిన్న (గురువారం) ఢిల్లీలో ఉంటే తానే ప్రధానమంత్రిని అనేవాడేమోనని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు శుక్రవారం అన్నారు.

జగన్ పారనోయ వ్యాధితో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ వ్యాధి ఉన్న వారు తమను తాము చాలా ఎత్తులో ఊహించుకుంటారని చెప్పారు. జగన్‌కు కూడా ఈ వ్యాధి ఉందని, ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

YS Jagan is suffering from Paranoia disease: Devineni

జగన్‌ను నిర్బంధించడం అనాగరిక చర్య ఆళ్ల నాని

ఏపీకి ప్రత్యేక హోదా కోసం విశాఖలో చేపట్టిన సదస్సుకు వెళ్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌ను రెండు గంటల పాటు విమానాశ్రయంలో నిర్బంధించడం అనాగరిక చర్య అని ఆ పార్టీ నేత ఆళ్ల నాని మండిపడ్డారు.

టిడిపి నేతలు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకోవడం సరికాదన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమానికి ప్రభుత్వం మద్దతు ఇవ్వనవసరం లేదని, కనీసం అడ్డు రాకుంటే చాలని చెప్పారు. ఈ నెల 29న ద్వారకా తిరుమలలో జగన్ పర్యటిస్తారని, సాయంత్రం నాలుగు గంటలకు సభ ఉంటుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+