ఆమెస్టర్ డ్యామ్ లో ల్యాండ్ అయిన జగన్-గన్నవరం ఎయిర్ పోర్టులో కలకలం ?
ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ కు కుటుంబ సమేతంగా ఆయన పయనం అయ్యారు. అయితే అదే సమయంలో గన్నవరం ఎయిర్ పోర్టులో కలకలం రేగింది. ఓవైపు సీఎం జగన్ కు వీడ్కోలు పలికేందుకు వైసీపీ నేతలు భారీ ఎత్తున తరలి వచ్చారు. మరోవైపు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ ఎన్నారై డాక్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్తున్న సమయంలో ఆయనకు సమీపంలో తుళ్లూరు లోకేష్ అనే ఓ ఎన్నారై డాక్టర్ సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. విచారించేందుకు ప్రయత్నించగా.. అతనికి గుండెపోటు వచ్చినట్లు తెలిపాడు. వెంటనే పోలీసులు అంబులెన్స్ ఎక్కించి అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి పంపేశారు. డిశ్చార్జ్ అయ్యాక అతని నుంచి మరిన్ని వివరాలు సేకరించే అవకాశముంది. పోలీసుల సమాచారం ప్రకారం ఈ డాక్టర్ జగన్ విదేశీ టూర్ కు సంబంధించిన మెసేజ్ లను ఇతరులకు పంపినట్లు తెలుస్తోంది.

మరోవైపు సీఎం జగన్ ఇవాళ ఉదయం ఆమె స్టర్ డ్యామ్ ఎయిర్ పోర్టులో దిగారు. అక్కడి నుంచి లండన్ లోని తన కుమార్తె వద్దకు వెళ్లి అనంతరం యూరప్ టూర్ కు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 31 వరకూ యూరప్ టూర్ కు వెళ్లేందుకు సీబీఐ కోర్టు ఇప్పటికే ఆయనకు అనుమతి ఇచ్చింది. దీంతో జగన్ వచ్చే నెల 1న తిరిగి రాష్ట్రానికి రానున్నారు. అనంతరం జూన్ 4న ఫలితాలపై నేతలతో సమావేశాలు నిర్వహించబోతున్నారు.












Click it and Unblock the Notifications