కోర్టుల పనీ పోలీసులే చేస్తారా ? రోడ్డుపై కొట్టి రౌడీ షీట్లా ? తెనాలిలో జగన్ విమర్శలు..!
రాష్ట్రం రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ రకంగా అదుపు తప్పిపోతే పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిపోతుందనేది దానికి తెనాలి ఘటనే నిదర్శనమని వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS jagan) తెలిపారు. తెనాలిలో పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడారు. తమకు వ్యతిరేకంగా వినిపించే గొంతుల్ని అణగదొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జగన్ ఆరోపించారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతూ, సాక్ష్యాలు సృష్టిస్తూ, జైళ్లలో పెడుతున్నారో తాజా ఘటనలు చూస్తే అర్థమవుతుందన్నారు.
పోలీసుల చేతుల్లో దెబ్బలు తిన్న వారిలో దోమ రాకేష్, చేబ్రోలు జాన్ విక్టర్, కరీముల్లా అనే దళితులు, మైనార్టీలు ఉన్నారన్నారు. సామాజికంగా, ఆర్ధికంగా అణగారిన వర్గాలకు చెందిన వారిపై పోలీసులు దాడి చేశారన్నారు. హైదరాబాద్ లో పనిచేస్తున్న రాకేష్ అనే యువకుడు పాత కేసుకు సంబంధించి కోర్టు వాయిదా కోసం తెనాలి వచ్చాడన్నారు. అలాగే మంగళగిరి నుంచి వచ్చిన జాన్ విక్టర్ అనే యువకుడు జూనియర్ అడ్వకేట్ అన్నారు. మంగళగిరి నుంచి కరీముల్లా అనే మెకానిక్ యువకుడు కూడా తెనాలి వచ్చాడన్నారు.

ఈ ముగ్గురూ స్నేహపూర్వకంగా కలవడానికి వస్తే ఐతానగర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సివిల్ డ్రెస్ లో ఉన్న కానిస్టేబుల్ ఎవరితోనే గొడవ పడుతుంటే ఆపడానికి ప్రయత్నించారని జగన్ తెలిపారు. దీంతో కానిస్టేబుల్ జాన్ విక్టర్ అనే బాధితుడి బైక్ కీస్, ఫోన్ లాక్కున్నాడని, తిరిగి కానిస్టేబుల్ నుంచి వీరు వెనక్కి లాక్కున్నారన్నారు. ఆ తర్వాత ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారన్నారు. మరుసటి రోజు పోలీసులు మంగళగిరికి వెళ్లి అడ్వకేట్ విక్టర్ ను, కరీముల్లాను కొట్టుకుంటూ తీసుకొచ్చారన్నారు. ఆరోజు రాత్రంతా తెనాలి టూటౌన్ పీఎస్ లో కొట్టారని ఆరోపించారు. ఆ తర్వాత రోజు స్టేషన్ కు దగ్గరే ఉన్న రోడ్డుపై తీసుకెళ్లి వాళ్లను అవమానించేలా రోడ్డుపైనే కొట్టారన్నారు.

తెనాలి టూటౌన్ సీఐతో పాటు పక్కనే ఉన్న మరో పీఎస్ సీఐ కూడా వీరిని కొట్టిన వారిలో ఉన్నారన్నారు. కాళ్లకు బొబ్బలు వచ్చేలా కొట్టాక స్టేషన్ కు తీసుకెళ్లి మరో సెంటర్లో పట్టపగలే మళ్లీ కొట్టారన్నారు. కొట్టడమే కాకుండా మూడు రోజులు స్టేషన్ లోనే తమ అదుపులో పెట్టుకున్నారన్నారు. ఆ తర్వాత విక్టర్ జేబులో కత్తిపెట్టి ఇద్దరు వీఆర్వోల్ని పిలిపించి పంచనామా రాసుకొన్నారన్నారు. మూడు రోజులు స్టేషన్లో పెట్టుకున్న వ్యక్తి జేబులో కత్తి ఎలా వచ్చిందన్నారు. ఆ తర్వాత వీరిని కోర్టులో హాజరుపర్చారన్నారు. అంతకుముందే వీరికి ఎలాంటి దెబ్బలూ లేవని డాక్టర్ దగ్గర సర్టిఫికెట్ తీసుకున్నారన్నారు.
గాయాలు ఉన్నాయని చెప్తే ఎస్పీ ఆఫీసుకు తీసుకెళ్లి కరెంటు షాక్ ఇప్పిస్తామని వీరిని పోలీసులు బెదిరించారన్నారు. పోలీసులు చెప్పే మాటలు వాస్తవమైతే ఘటన జరిగిన మరుసటి రోజు ఉదయం వరకూ కానిస్టేబుల్ ఎందుకు చెప్పకుండా ఉన్నారని ప్రశ్నించారు. సివిల్ డ్రెస్ లో కానిస్టేబుల్ అంబేద్కర్ కాలనీకి ఎందుకొచ్చాడని, ఈ ముగ్గురితో ఎందుకు గొడవ పడ్డాడని ప్రశ్నించారు. 24 గంటల్లో వీరిని ఎందుకు కోర్టులో హాజరుపర్చలేదన్నారు. ఇది చట్ట ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు.
తెనాలి టూటౌన్ పోలీసులు ఈ కేసు హ్యాండిల్ చేస్తున్నప్పుడు పక్క స్టేషన్లో ఉన్న సీఐకి ఏం సంబంధమని, అతను ఎందుకు వచ్చి వీళ్లను కొట్టాడని జగన్ ప్రశ్నించారు. కోర్టులో ప్రవేశపెట్టేముందు ఆస్పత్రిలో వీరు పోలీసులు కొట్టిన గాయాలు చూపించినా డాక్టర్లు ఎందుకు వాటిని నమోదు చేయలేదని ప్రశ్నించారు. మెడికో లీగల్ కేసు అవుతుందన్న కారణంతో పోలీసులు డాక్టర్లను బెదిరించి ఉండొచ్చని, లేదా డాక్టర్లు ప్రలోభాలకు లోనై ఉండొచ్చన్నారు.
నెల రోజుల వీరిని కొట్టే వీడియో బయటికి వచ్చిందన్నారు. పోలీసుల్లో కొంతమంది మంచివారు ఈ అన్యాయాన్ని జీర్ణించుకోలేక బయటపెట్టారన్నారు. చట్టాన్ని ఉల్లంఘించింది, అపహాస్యం చేసిందీ, బాధితుల్ని అవమానించిందీ పోలీసులే అన్నారు. తమ చర్యల్ని సమర్ధించుకునేందుకే పోలీసులు వీరిపై రౌడీ షీటర్లు, గంజాయ్ బ్యాచ్ అని ముద్ర వేస్తున్నారన్నారు. పాత కేసులకూ ఈ ఘటనకూ సంబంధం ఏంటన్నారు. పోలీసులు వీరిపై రోడ్డుపై కొట్టాక వాళ్ల చర్యను సమర్ధించుకునేందుకు రౌడీ షీట్లు ఓపెన్ చేశారన్నారు. పాత కేసులన్న వీరిని రోడ్డుపై కొడితే 21 కేసులున్న చంద్రబాబునూ కొడతారా అని జగన్ ప్రశ్నించారు.

Click it and Unblock the Notifications