బాబు పాలనంతా మోసమే: ఇంటింటికీ తిరిగిన వైయస్ జగన్(పిక్చర్స్)

నెల్లూరు: ఇటీవల భారీ కురిసిన వర్షాలకు నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఉదయం ఆయన మన్సుర్‌నగర్‌లో పర్యటించారు. వరద బాధితుల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. భారీ వర్షాలు, వరదలు వల్ల వేలాదిమంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారన్నారు. కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వరదల వల్ల ప్రజలు నష్టపోయారని, ప్రతి ఇంటికి రూ.5వేల చొప్పన ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోవడం శోచనీయమని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి బాధితులను ఆదుకోవాలన్నారు.

సర్వేల పేరుతో అధికారులు కొందరి పేర్లు మాత్రమే నమోదు చేస్తున్నారని, వరద సాయంలో వివక్ష చూపడం తగదని జగన్ అన్నారు. బాధితులను ఆదుకోవడం పోయి.. చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని జగన్ విమర్శించారు. మోసపూరిత హామీలతో బాబు అధికారంలోకి వచ్చారని ఆయన మండిపడ్డారు.

చంద్రబాబు పాలన అంతా మోసం అన్న పదాల చుట్టే తిరుగుతుందని అన్నారు. కరవు మండలాల ప్రకటన, ఇన్‌పుట్ సబ్సిడీలోనూ ప్రజలకు చెవిలో పూలు పెడుతున్నారని జగన్ ధ్వజమెత్తారు. అధికారంలోకి రాగానే కొత్త ఇళ్లు కట్టిస్తామన్న చంద్రబాబు.. ఇప్పుడు 30 ఏళ్లుగా ఉన్న ఇళ్లను కూల్చివేస్తామని చెప్పడం అన్యాయమన్నారు.

చంద్రబాబు మాత్రం అక్రమంగా కట్టిన ఇంట్లో ఉంటూ.. పేదల కడుపు కొడతాననడం దారుణమన్నారు. వరద బాధితులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నివిధాల తోడుగా ఉంటుందని, వరద సాయంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తామని జగన్ హామీ ఇచ్చారు.

కాగా, గత మూడు రోజులుగా వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్ వైయ జగన్.. గురువారం రాత్రికి ఆయన నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు తిరిగివెళ్తారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి గోదావరి జిల్లాలకు వెళతారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాగా దెబ్బతిన్న ప్రాంతాల్ని సందర్శిస్తారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

ఇటీవల భారీ కురిసిన వర్షాలకు నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

గురువారం ఉదయం ఆయన మన్సుర్‌నగర్‌లో పర్యటించారు. వరద బాధితుల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. భారీ వర్షాలు, వరదలు వల్ల వేలాదిమంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వరదల వల్ల ప్రజలు నష్టపోయారని, ప్రతి ఇంటికి రూ.5వేల చొప్పన ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోవడం శోచనీయమని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి బాధితులను ఆదుకోవాలన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

సర్వేల పేరుతో అధికారులు కొందరి పేర్లు మాత్రమే నమోదు చేస్తున్నారని, వరద సాయంలో వివక్ష చూపడం తగదని జగన్ అన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

బాధితులను ఆదుకోవడం పోయి.. చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని జగన్ విమర్శించారు. మోసపూరిత హామీలతో బాబు అధికారంలోకి వచ్చారని ఆయన మండిపడ్డారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

చంద్రబాబు పాలన అంతా మోసం అన్న పదాల చుట్టే తిరుగుతుందని అన్నారు. కరవు మండలాల ప్రకటన, ఇన్‌పుట్ సబ్సిడీలోనూ ప్రజలకు చెవిలో పూలు పెడుతున్నారని జగన్ ధ్వజమెత్తారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

అధికారంలోకి రాగానే కొత్త ఇళ్లు కట్టిస్తామన్న చంద్రబాబు.. ఇప్పుడు 30 ఏళ్లుగా ఉన్న ఇళ్లను కూల్చివేస్తామని చెప్పడం అన్యాయమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+