చచ్చేదాకా కొట్టాలన్న స్పీకర్ మాటలు, ప్రతిపక్ష హోదాపై.. స్పీకర్ కు వైఎస్ జగన్ లేఖ!!

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడుకి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై ఆయన తన లేఖ ద్వారా అసహనం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు జగన్ తను రాసిన లేఖలో మంత్రుల తర్వాత తనతో ప్రమాణస్వీకారం చేయించడం పద్ధతులకు విరుద్ధమని పేర్కొన్నారు.

ప్రతిపక్ష హోదాపై జగన్ లేఖ
ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకున్నట్టున్నారు. అందులో భాగంగానే తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని దానిని ఇప్పటివరకు ఎవరు పాటించలేదని జగన్ తెలిపారు.

YS Jagan letter to the AP assembly speaker on the status of the opposition

చచ్చే దాకా కొట్టాలన్న స్పీకర్ మాటలు
పార్లమెంటులో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎప్పుడూ ఈ నిబంధనను పాటించలేదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని చేపట్టిన టిడిపి అధికార కూటమి, స్పీకర్ ఇప్పటికే తన పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయని పేర్కొన్న వైయస్ జగన్ ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీలో తన గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదన్నారు.

వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అభ్యర్ధన
ప్రతిపక్ష హోదాతోనే బలంగా తమ వాయిస్ ను వినిపించే అవకాశం ఉంటుందని, ప్రజా సమస్యల కోసం తాము అప్పుడు మాట్లాడగలుగుతామని జగన్ తెలిపారు. ప్రతిపక్ష పార్టీ హోదాతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్య లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని లేఖను పరిశీలించాలని తాను కోరుతున్నానని జగన్ స్పీకర్ కు రాసిన లేఖలో వెల్లడించారు.

జగన్ రాసిన లేఖకు స్పీకర్ స్పందిస్తారా?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఎక్కువ సీట్లు కలిగి ఉన్నది కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరాన్ని జగన్ ఈ లేఖ ద్వారా స్పష్టం చేశారు. మరి శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు జగన్ రాసిన లేఖపైన ఏ విధంగా స్పందిస్తారు? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అంశం పైన ఏం సమాధానం చెబుతారు అనేది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+