వివేకా ఛార్జిషీట్ పై జగన్ వ్యూహాత్మక మౌనం-సీబీఐపై ఎదురు కేసుల వెనుక ? సుప్రీంకు వెళ్తారా ?
ఏపీలో రెండేళ్ల క్రితం తీవ్ర కలకలం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు దాదాపుగా కొలిక్కి వచ్చింది. ఈ కేసులో అసలు నిందితుల్ని పట్టుకోవడం లేదంటూ గతంలో అనుమానితులు చేసిన ఆరోపణలతో వేగం పెంచిన సీబీఐ.. తాజాగా పెద్ద చేపల పేర్లు బయటపెడుతోంది. వీరంతా సీఎం జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు కావడంతో ఇప్పుడు ప్రభుత్వ వ్యూహం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తి రేపుతోంది. సీబీఐ ఛార్జిషీట్ ఆధారంగా చర్యలు ఆరంభిస్తే జగన్ ఎలా స్పందిస్తారన్న దానిపై భిన్న చర్చలు సాగుతున్నాయి.

వివేకా హత్య కేసులో సంచలనాలు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో తాజాగా సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో సీబీఐ రెండేళ్లుగా చేసిన దర్యాప్తు ఓ ఎత్తు, ఇప్పుడు చేస్తున్న దర్యాప్తు ఓ ఎత్తు అన్నట్లుగా పరిస్ధితులు మారిపోయాయి. దీంతో ఈ కేసులో అందరూ అనుమానిస్తున్నట్లుగానే పెద్ద చేపల పేర్లు బయటికి వస్తున్నాయి. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. ముఖ్యంగా సీబీఐ తాజాగా వేసిన ఛార్జిషీట్లో పేర్కొన్న అంశాలు రాష్ట్ర రాజకీయాల్ని రాబోయే రోజుల్లో పట్టి కుదిపేయడం ఖాయంగా కనిపిస్తోంది

మలుపుతిప్పిన ఛార్జిషీట్
సీబీఐ దర్యాప్తులో భాగంగా వివేకాను ఎవరు చంపారనే అంశాన్ని ఇప్పటివరకూ దాఖలు చేసిన ఛార్జిషీట్లో సీబీఐ పేర్కొంటూ వచ్చిన వివరాలకూ, తాజాగా బయటపడిన వివరాలకు సైతం పొంతన లేకపోవడంతో తాజా ఛార్జిషీట్ లో వెల్లడైన అంశాలు రాజకీయ రచ్చకు తావిస్తున్నాయి. ముఖ్యంగా కడప ఎంపీ, సీఎం జగన్ సోదరుడు కూడా అయిన వైఎస్ అవినాష్ రెడ్డిని ప్రధాన అనుమానితుడిగా పేర్కొంటూ సీబీఐ కోర్టుకు సమర్పించిన అభియోగపత్రం ఇప్పుడు వైఎస్ కుటుంబాన్ని సైతం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో ఈ ఛార్జిషీట్ ఆధారంగా సీబీఐ చేపట్టబోయే చర్యలు కూడా ఆసక్తి రేపుతున్నాయి.

సీబీఐని టార్గెట్ చేస్తున్న నిందితులు
వివేకా హత్య కేసులో నిందితులు, అనుమానితులు సీబీఐ ఛార్జిషీట్ లో పేర్కొన్న అంశాలు, దస్తగిరి అప్రూవర్ గా మారడానికి సీబీఐ ఇచ్చిన అవకాశాన్ని ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే పులివెందుల, జమ్మలమడుగు కోర్టులతో పాటు హైకోర్టు కూడా వీరి ఆరోపణల్ని తోసిపుచ్చాయి. అయినా సీబీఐని వీరు టార్గెట్ చేస్తూనే ఉన్నారు.అలాగే సీబీఐ విచారణకు పిలిపించగానే తమను వేధిస్తోందంటూ స్ధానిక పోలీసుల్ని ఆశ్రయిస్తుండటం కలకలం రేపుతోంది. వీరి ఆరోపణల ఆధారంగా సీబీఐపై స్ధానిక పోలీసులు చర్యలు తీసుకునే అవకాశాలు లేవు. అయినా సీబీఐ దర్యాప్తు సక్రమంగా జరగడం లేదని ఆరోపిస్తూ వీరు పోలీసుల్ని ఆశ్రయించడం కొత్త సంకేతాలు ఇస్తోంది.

ఛార్జిషీట్ పై సుప్రీంకు వెళతారా ?
సీబీఐ ఛార్జిషీట్ లో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, ఆయన సోదరుడు మనోహర్ రెడ్డి పేర్లను అనుమానితులుగానే సీబీఐ ఇప్పటివరకూ పేర్కొంటోంది. అయితే తాజా ఛార్జిషీట్ లో అవినాష్ రెడ్డి కడప ఎంపీ టికెట్ దక్కదన్న దుగ్ఘతోనే వివేకాను హత్య చేయించి ఉండొచ్చని అనుమానించడంతో ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. దీంతో సీబీఐ అనుమానాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు వైసీపీ, వైఎస్ కుటుంబం సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

జగన్ అడుగులపై ఉత్కంఠ ?
గతంలో ఓసారి వివేకా హత్య కేసులో సీబీఐ అభియోగాలు, టీడీపీ ఆరోపణలపై స్పందించిన వైఎస్ జగన్... తన బాబాయ్ ను తాము ఎందుకు చంపుకుంటామంటూ బహిరంగంగానే ప్రశ్నించారు. ఇప్పుడు సీబీఐ ఛార్జిషీట్ లో బయటపడిన అవినాష్ రెడ్డి పేరు, ఇతర అంశాలపై జగన్ మౌనంగా ఉంటున్నారు. దీంతో కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవినాష్ పేరును సీబీఐ ఛార్జిషీట్ లో ఊహించడం వల్లే జగన్ మౌనంగా ఉంటున్నారా లేక గతంలోలా కోర్టుల్ని ఆశ్రయించి సీబీఐ దర్యాప్తులో వివరాలు బయటికి రాకుండా, మీడియాలో ప్రసారం, ప్రచారం కాకుండా చూడాలని కోరబోతున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇందులో ఏ ఒక్కటి చేసినా జగన్ పైనా అనుమానాలు పెరిగే అవకాశం ఉండటంతో సీఎం ఆచిచూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications