వైసిపి కీలక నిర్ణయాలు: పాదయాత్ర కోసం ఛానళ్ల సీఈవోలతో జగన్ భేటీ!
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో పార్టీ అధినేత జగన్ సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించే యోచన కూడా ఉంది.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో పార్టీ అధినేత జగన్ సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించే యోచన కూడా ఉంది.
చదవండి: కోర్టు షాక్, డీలాపడ్డ జగన్ ఇలా: అసెంబ్లీ బాధ్యత పెద్దిరెడ్డికి, బడ్జెట్‌కు రావాల్సిందే
అయితే ఈ నెల 26వ తేదీన జరగనున్న వైసిఎల్పీ భేటీలో సమావేశాల బహిష్కరణపై నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తర్వాతనే తుది ప్రకటన చేయనున్నారు.
చదవండి: ఇమేజ్ డ్యామేజ్, ఎదురుగాలి: రేవంత్‌కు కాంగ్రెస్ దిమ్మతిరిగే షాక్, రాంగ్‌స్టెప్?

వారిపై చర్యలు తీసుకోవాల్సిందే
భేటీ అనంతరం వైసిపి నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేలోగా పార్టీ ఫిరాయించిన 20 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను డిమాండ్ చేశారు. నలుగురు మంత్రులను బర్తరఫ్ చేయాలన్నారు.

సభ సంప్రదాయాల ప్రకారం మాకు అవకాశం
అలాగే, శాసన సభ సంప్రదాయాల ప్రకారం ప్రతిపక్షానికి ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం కల్పించాలన్నారు. తమ భేటీలో రైతుల సమస్యలు, రుణమాఫీ, చంద్రబాబు విదేశీ పర్యటన, అసెంబ్లీ సమావేశాలు, పాదయాత్ర తదితర అంశాలు చర్చించినట్లు పెద్దిరెడ్డి చెప్పారు.

టిడిపి దిగజారుడుతనం
అసెంబ్లీని ఆగస్టులోనే నిర్వహించకుండా జగన్ పాదయాత్ర ప్రారంభ సమయంలో అధికార టిడిపి సమావేశాలు నిర్వహిస్తుండటం దిగజారుడుతనానికి నిదర్శనమని పెద్దిరెడ్డి అన్నారు. అందుకే హాజరుకాకపోవడం మంచిదని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారని, అయితే ఏ నిర్ణయాన్ని 26న ఎల్పీ భేటీలో చర్చించి నిర్ణయిస్తామన్నారు.

ఛానళ్లు, పత్రికల సీఈవోలతో జగన్ భేటీ
భేటీలో జగన్ పాదయాత్రపై కూడా చర్చించినట్లు చెప్పారు. జగన్ పాదయాత్ర సమయంలో యాత్ర జరిగే జిల్లా మినహా మిగిలిన 12 జిల్లాల్లో ఏ తరహా కార్యక్రమాలు చేపట్టాలనే విషయమై ప్రణాళికను రూపొందిస్తున్నట్లు పెద్దిరెడ్డి చెప్పారు. కాగా, పాదయాత్ర నేపథ్యంలో జగన్ వివిధ పత్రికలు, ఛానళ్ల సీఈవోలను మంగళవారం ఆహ్వానించారు. తన పాదయాత్రకు ప్రచారం కల్పించాలని కోరే అవకాశముంది. ఇప్పటికే రామోజీ రావును కలిశారు.












Click it and Unblock the Notifications