ఇమేజ్ డ్యామేజ్, ఎదురుగాలి: రేవంత్‌కు కాంగ్రెస్ దిమ్మతిరిగే షాక్, రాంగ్‌స్టెప్?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆయన తీరుపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.

రేవంత్ తగ్గడం వెనుక కారణాలు అనేకం: నష్టం జరిగాక ఆలస్యంగా, ఇలా షాక్, వీటికి సమాధానమేది?

కాంగ్రెస్ పార్టీలో చేరుతానని సంకేతాలు ఇవ్వడం, ఆ తర్వాత చాలా ఆలస్యంగా తనపై జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని చెప్పడం ఇటు టిడిపితో పాటు అటు కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఆగ్రహం తెప్పించిందని తెలుస్తోంది. 

అంతా తూచ్, అబద్దం, మా నేతలను అంటారా: హఠాత్తుగా రేవంత్ యూటర్న్, ఎందుకు!?

 యూటర్న్‌పై ఆగ్రహం

యూటర్న్‌పై ఆగ్రహం

రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ప్రకటించగానే కొందరు నేతలు స్వాగతించారు. ఆయనకు ఉన్న ఇమేజ్ తమకు మరింత ఉత్సాహం తీసుకు వస్తుందని భావించారు. కొందరు మాత్రం వ్యతిరేకించారు. కాంగ్రెస్‌లో మెజార్టీ నేతలు, కేడర్ రేవంత్ రావడంపై హర్షం వ్యక్తం చేసింది. కానీ ఓ వైపు చర్చలు జరుగుతుండగానే హఠాత్తుగా యూటర్న్ తీసుకుంటారనే ప్రచారంపై టి కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.

 అసలు రమ్మన్నది ఎవరు? అర్రులు చాచిందని

అసలు రమ్మన్నది ఎవరు? అర్రులు చాచిందని

అసలు ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మన్నది ఎవరని, తొలుత చర్చలు ఎందుకు జరిపారని, ఇంత జరిగాక యూటర్న్ తీసుకునే వార్తలపై స్పష్టత ఇవ్వకపోవడం ఏమిటని అంటున్నారు. రేవంత్ రెడ్డి కోసం కాంగ్రెస్ పార్టీ అర్రులు చాచిందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని, అధికార టిఆర్ఎస్ పార్టీకి ఆయుధంగా మారుతుందని కొందరు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని సమాచారం.

 ఓ వైపు టిడిపి, మరోవైపు కాంగ్రెస్ ఆగ్రహం

ఓ వైపు టిడిపి, మరోవైపు కాంగ్రెస్ ఆగ్రహం

టిడిపి కూడా ఆయన వ్యాఖ్యలపై సంతృప్తి చెందడం లేదు. ఇప్పటికే రేవంత్‌పై టి-టిడిపి చంద్రబాబుకు నివేదిక ఇచ్చింది. చంద్రబాబు వచ్చాక తాను మాట్లాడుతానని రేవంత్ చెప్పారు తప్ప, కాంగ్రెస్‌లో చేరుతారా లేదా అన్న అంశంపై వివరణ ఇవ్వలేదని టిటిడిపి నేతలు అంటున్నారు. దీంతో ఆయనపై చంద్రబాబుతో భేటీకి ముందే వేటు వేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. వివరణపై టిడిపి ఆయన మాటలు నమ్మడం లేదు.

 ఆయన రాంగ్ స్టెప్ వేశారు, వారు చేజారిపోయారు

ఆయన రాంగ్ స్టెప్ వేశారు, వారు చేజారిపోయారు

రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నప్పటికీ, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని తెలిసే టిడిపి ఆయనపై వేటు వేయాలని చూస్తోందని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి రాంగ్ స్టెప్ వేశారని రేవంత్ రెడ్డి సొంత నియోకవర్గంలో గుసగుసలాడుకుంటున్నారు. స్వయంగా నిన్నటిదాకా ఆయన వెంట ఉన్న నాయకులే.. రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జరిగాక తెరాసలో చేరారని గుర్తు చేస్తున్నారు. కొడంగల్‌ నియోజకవర్గానికి చెందిన టిడిపి రాష్ట్ర కార్యదర్శి బాల్‌సింగ్ నాయక్‌, జెడ్పీటీసీ సభ్యురాలు అనసూయమ్మ, ఎంపీపీ సంగీత శివకుమార్‌, వైస్‌ ఎంపీపీ సాయప్ప, టిడిపి జిల్లా అధికార ప్రతినిధి వీరేష్ గౌడ్‌, మండల పార్టీ అధ్యక్షుడు వీరారెడ్డి, పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, ఇతర నేతలు మూడు రోజుల క్రితం అధికార తెరాసలో చేరారు. రేవంత్ టిడిపిలో ఉన్నంత కాలం ఆయనపై నమ్మకంతో ఉన్న నేతలే పార్టీ మారడం గమనార్హం. ఇదే ఆయన రాంగ్ స్టెప్‌కు నిదర్శనం అంటున్నారు.

 అనుకున్నదొక్కటి, అయ్యింది ఒక్కటి

అనుకున్నదొక్కటి, అయ్యింది ఒక్కటి

ఇప్పుడు రేవంత్ రెడ్డి పార్టీ మారినా, మారకపోయినా ఆయనకు ఇన్నాళ్లుగా ఉన్న ఇమేజ్ దెబ్బతీసుకున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు టిడిపి ఆయన వివరణపై సంతృప్తి వ్యక్తం చేయకపోవడం, కాంగ్రెస్ నేతల ఆగ్రహం, నియోజకవర్గంలో సొంత నాయకులు చేజారుతుండటం.. ఇవన్నీ చూస్తుంటే ఆయన తనకు తానుగా ఇమేజ్ దెబ్బతీసుకున్నారని అంటున్నారు. మొత్తానికి ఆయన అనుకున్నది ఒక్కటి అయితే, జరిగింది మరొకటి అని అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Telugu Desam Party politburo members passed a resolution at a hurriedly convened meeting on Sunday, seeking expulsion of working president and floor leader in the Assembly A Revanth Reddy.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి