పశ్చిమాసియాలో యుద్ధం.. కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు..

ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దేశంలో రవాణా రంగం ఆధునీకరణ, వాయు కాలుష్య నివారణ, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏకంగా రూ. 39,290 కోట్ల భారీ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

పశ్చిమాసియా యుద్ధం, పాక్‌ గగనతల మూసివేత కారణంగా దేశీయ విమానయాన రంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ సరికొత్త వ్యూహాత్మక ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయెల్‌(ATF) ధరల భారం నుంచి విమానయాన సంస్థలను కాపాడేందుకు చమురు సంస్థలకు 10 వేల కోట్లను వడ్డీ లేని ఆర్థిక సాయంగా ప్రకటించింది. దీనివల్ల ఇంధన ధరలు పెరిగినా, విమాన టికెట్ల ధరలు అకస్మాత్తుగా పెరగకుండా ప్రయాణికులకు ఉపశమనం లభిస్తుంది.

దిల్లీ, పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పాత వాణిజ్య వాహనాలను మార్చే భారీ ప్రాజెక్ట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. 1.9 లక్షలకు పైగా పాత ట్రక్కులు, 16 వేల పాత బస్సులను స్క్రాప్ చేసి వాటి స్థానంలో కొత్త బీఎస్-6 లేదా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే కొత్త వాహనాల కొనుగోలుపై తీసుకునే రుణాలపై 5 శాతం వడ్డీ రాయితీ ప్రకటించింది. చమురు కంపెనీల ద్వారా ఐదేళ్లపాటు ప్రతి నెలా ఉచిత ఇంధన ఓచర్లు అందనున్నాయి. అలాగే ఆటోమొబైల్ తయారీదారుల నుంచి ప్రత్యేక డిస్కౌంట్లు వస్తాయి. అంతేకాక కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు, 10 సంవత్సరాల పాటు 100 శాతం మోటార్ వాహన పన్ను మినహాయింపు ఉంటుంది.

Cabinet Approves 39 290-Cr Mega Package For Transport Growth Infrastructure Green India Cabinet

ఇక రూ. 24, 249 కోట్లతో భారీ రహదారుల విస్తరణకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణకు చెందిన NH-63, NH-563 జాతీయ రహదారుల విస్తరణకు ఆమోదం దక్కింది. దేశవ్యాప్తంగా కనెక్టివిటీని మెరుగుపరచడం అలాగే ప్రయాణ సమయాన్ని తగ్గించడం, సరకు రవాణా సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈ రహదారి ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు కేబినెట్ పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+