AP Weather: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు- అక్కడ మాత్రం ఎండలే..!

నైరుతి రుతుపవనాల రాక వేళ ఆంధ్రప్రదేశ్ లో మిశ్రమ వాతావరణ (AP Weather) పరిస్ధితులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో పలు చోట్ల ఇప్పటికే ఎండలు తగ్గుముఖం పట్టినా ఉక్కపోత కొనసాగుతోంది. అయితే కొన్ని చోట్ల మాత్రం ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రేపు కూడా విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

AP El Nino 2026: ఏపీకి ఎల్ నినో ముప్పు తీవ్రమే ? నిపుణుల తాజా వార్నింగ్..!
AP El Nino 2026: ఏపీకి ఎల్ నినో ముప్పు తీవ్రమే ? నిపుణుల తాజా వార్నింగ్..!

రేపు ఒకవైపు ఎండ ప్రభావం చూపే సూచనలు ఉన్నాయని, అలాగే పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని డైరెక్టర్ తెలిపారు. రేపు శ్రీకాకుళం జిల్లాలో 11 మండలాలు, విజయనగరం 19, మన్యం 14, అల్లూరి 1, పోలవరం 1 మండలం మొత్తంగా 46 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 79 మండలాల్లో వడగాల్పులు, శుక్రవారం 85 తీవ్ర, 67మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. ఏలూరు, పోలవరం, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43-45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందన్నారు.

AP Weather Forecast Tomorrow IMD Predicts Rain in Some Districts Heatwave in Others
EL Nino ఎఫెక్ట్: రైతులకు మధ్యంతర కరవు ముప్పు ? ఆ పంట మాత్రం వేయొద్దు..!
EL Nino ఎఫెక్ట్: రైతులకు మధ్యంతర కరవు ముప్పు ? ఆ పంట మాత్రం వేయొద్దు..!

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, మార్కాపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40-42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు. దీని ప్రభావంతో రేపు పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ *పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు* కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే ఇతర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+