లండన్ టూర్: తెలుగు ప్రజలతో జగన్ ఏం చెప్పారంటే..(వీడియో)

Subscribe to Oneindia Telugu

లండన్: తన కూతురు వర్షను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ చేర్పించేందుకు వెళ్లిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్కడి తెలుగువారిని కలిశారు. ఈ సందర్భంగా వారితో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వైయస్ జగన్మోహన్ రెడ్డికి అక్కడి తెలుగువారు ఘన స్వాగతం పలికారు.

'శభాష్ వర్ష': కూతురు కోసం లండన్‌కు జగన్, ఎందుకంటే..?

పాపను చేర్పించేందుకే వచ్చా

పాపను చేర్పించేందుకే వచ్చా

తెలుగువారితో సమావేశమైన సందర్భంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తన యూకే పర్యటన పర్సనల్ ట్రిప్ గానే కొనసాగుతోందని చెప్పారు. తన పాప(వర్ష)కు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో సీటొచ్చిందని తెలిపారు. వర్షను స్కూల్‌లో చేర్పించి, సెటిల్ చేయించి వచ్చానని జగన్ తెలిపారు.

అందుకే కలిశా..

అందుకే కలిశా..

ఆ తర్వాత అక్కడి నుంచి మన తెలుగువాళ్లను కలిసేందుకు ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఇక్కడిదాకా వచ్చాను కాబట్టి, ఇక్కడి తెలుగువారిని కలిస్తే బాగుంటుందని తాను అనుకున్నానని, స్నేహితులు కూడా అదే చెప్పడంతో ఇలా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కలిశానని చెప్పారు.

అప్యాయంగా..

అప్యాయంగా..

ఇక్కడి తెలుగువారు తనకు ఎయిర్‌పోర్ట్ నుంచే ఎంతో అప్యాయంగా స్వాగతం పలికారని జగన్ చెప్పారు. తెలుగువారిని కలిసి మాట్లాడటం తనకు సంతోషంగా ఉందని తెలిపారు. అందరి వద్దకు వచ్చి మాట్లాడతానని చెప్పారు.

కృతజ్ఞతలు.. మహత్ భాగ్యం

తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఆయన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, జగన్ తమను కలవడం తమ మహత్ భాగ్యమని కార్యక్రమంలో హాజరైన తెలుగువారు చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party president YS Jaganmohan Reddy met telugu people in london.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి