విదేశాలకు జగన్, న్యూ లుక్ లో - ఈ సారి అక్కడే..!!

మాజీ సీఎం జగన్ విదేశాలకు వెళ్లారు. బెంగళూరు నుంచి కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పర్యటన నిమిత్తం యూరప్ బయల్దేరారు. నిత్యం ఒకే విధమైన వస్త్రధారణతో కనిపించే జగన్ విదేశాలకు వెళ్లే సమయంలో కొత్త లుక్ లో దర్శనమిచ్చారు. సీబీఐ కోర్టు అనుమతితో జగన్ ఈ పర్యటన ఖరారు చేసుకున్నారు. రెండు వారాల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. కాగా, ఈ సారి లండన్ కేంద్రంగా జగన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

మాజీ ముఖ్యమంత్రి జగన్ విదేశాలకు బయల్దేరారు. కొద్ది రోజుల క్రితం ఈ మేరకు సీబీఐ కోర్టు అనుమతి కోరారు. కుటుంబ సభ్యులతో కలిసి యూపర్ పర్యటనకు వెళ్లేందుకు జగన్ ప్రణాళికలు సిద్దం చేసారు. ఈ మేరకు కోర్టు అనుమతి కోరారు. తమ కుమార్తెల వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేసారు. 15 రోజుల పాటు జగన్ యూరప్ పర్యటన కొనసాగనుంది. ఈ పిటీషన్ పైన విచారణ చేసిన సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. కుటుంబంతో కలిసి యూరప్ దేశాల్లో పర్యటించేందుకు దాదాపు 25 రోజుల సమయం కావాలని కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. జగన్ విదేశాలకు వెళ్లాలంటే ప్రతిసారి కోర్టు అనుమతి తప్పనిసరి. ఆయన పాస్‌పోర్ట్ ప్రస్తుతం కోర్టు స్వాధీనంలోనే ఉంది. గతంలో జగన్ విదేశాలకు వెళ్లినప్పుడు అధికారులకు తప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ నుంచి ఔట్, అసలు కారణం..!?
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ నుంచి ఔట్, అసలు కారణం..!?
ys-jagan-mohan-reddy-to-jet-off-to-london-for-15-day-private-visit-return-expected-in-mid-may

రెండు వారాలు అక్కడే

జగన్ కుమార్తెలు ఇద్దరూ లండన్‌లోనే ఉన్నత చదువులు పూర్తి చేసి, అక్కడే స్థిరపడ్డారు. గతంలో వారి గ్రాడ్యుయేషన్ డే కోసం కూడా జగన్ లండన్ వెళ్లి వచ్చారు. ఈ నెల 20 నుంచి మే 15 వరకు జగన్ లండన్.. యూరప్ పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి కోసం జగన్ రూ. లక్ష పూచీకత్తు సమర్పించాలని, పర్యటన ముగించుకుని వచ్చాక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలకు హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. దీంతో.. జగన్ కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లారు. సాధారణంగా జగన్ అధికారంలో ఉన్నా.. లేకపోయినా డ్రెస్ కోడ్ మాత్రం సాధారణంగానే ఉంటుంది. తెల్ల రంగులో ఉన్న షర్ట్ ను ధరిస్తారు. ఎక్కువగా కాకి కలర్ ప్యాంటును ధరిస్తుంటారు. అయితే ఇప్పుడు విదేశీ పర్యటనలు జీన్స్ ప్యాంట్, బ్లూ షర్ట్, షూస్ వేసుకొని న్యూ లుక్ తో కనిపించడంతో.. అదిరిందయ్యా జగన్ అంటూ ఎక్కువమంది అభినందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+