వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరిపోదు... అంతకు మించి కావాలి?

|
Google Oneindia TeluguNews

రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్నారు చంద్రబాబునాయుడు. ఆయన వ్యూహం వేస్తే ప్రత్యర్థి పార్టీలపై పైచేయిగా ఉండేది. అటువంటి చంద్రబాబునాయుడికే అర్థంకాని రీతిలో, అనూహ్యమైన వ్యూహాలతో ముందుకు రావడం వైఎస్ జగన్ కు అలవాటుగా మారిపోయింది. చంద్రబాబుపైనే పైచేయి సాధించేలా పదునైనా వ్యూహాలను అల్లడం, వాటిని అమలు చేయడంలో జగన్ తన మార్కును చూపిస్తున్నారు.

ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు

ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు


వచ్చే ఎన్నికలు తెలుగుదేశం, వైసీపీ.. రెండు పార్టీలకు అత్యంత కీలకమైనవి. అధికారంలోకి వచ్చిన పార్టీనే నిలుస్తుంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీని భారతీయ జనతాపార్టీ నేతలు కబ్జా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అధికారంలోకి రావాలనుకున్న రాష్ట్రంలో ముందుగా బీజేపీ ప్రతిపక్షంలోకి వస్తుంది. అక్కడి నుంచి అధికారాన్ని దక్కించుకుంటుంది. ఆ అవకాశం బీజేపీకి ఇవ్వకుండా ఉండటానికి ఇరు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి.

గడప గడపకు పోటీగా ఇదేం ఖర్మ

గడప గడపకు పోటీగా ఇదేం ఖర్మ

తెలుగుదేశం పార్టీ ఇటీవలే 'బాదుడే బాదుడు'తోపాటు కొత్తగా'ఇదేం ఖర్మ' పేరుతో ప్రజల్లోకి దూసుకుపోయింది. వైఎస్ జగన్ వల్ల ఏపీ నాశనమైందని, అభివృద్ధి లేని, వీటిని ప్రజలు గుర్తుంచుకోవాలని తెలుగుదేశం నేతలు ఇంటింటికీ ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్' గడప గడపకు మన ప్రభుత్వానికి' పోటీగా తెలుగుదేశం 'ఇదేంఖర్మ'ను ప్రారంభించింది. వైసీపీ కార్యక్రమంలో మంత్రుల నుంచి వార్డు సభ్యుల వరకు అందరూ భాగస్వాములవగా, టీడీపీ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతున్నారు.

గడప గడపకు సరిపోదు.. ఇంకా ఏదో కావాలి

గడప గడపకు సరిపోదు.. ఇంకా ఏదో కావాలి


'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం సరిపోదని, అంతకుమించి ఇంకా ఏదో ఉండాలని జగన్ యోచిస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరును మదింపు చేస్తున్నారు. వారి పనితీరును పరిశీలించడానికి 175 నియోజకవర్గాల్లో పరిశీలకులను నియమించారు. వీరిని సమన్వయం చేయడానికి ప్రాంతీయ సమన్వయకర్తలున్నారు. ఇదే క్రమంలో ప్రతి 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ ఉన్నట్లుగానే ప్రతి 50 ఇళ్ళకు పార్టీ కార్యకర్తను పరిశీలకుడిగా నియమిస్తున్నారు. వారు 50 ఇళ్లల్లో పథకాలు ఎలా అమలవుతున్నాయి? పూర్తిగా వైసీపీకే వారు మద్దతివ్వాలంటే ఏం చర్యలు చేపట్టాలి? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇలా వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకొచ్చిన జగన్ రానున్న అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతున్నారు. 175 సీట్లు దక్కించుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

English summary
It has become a habit of YS Jagan to come up with unexpected strategies in a way that Chandrababu Naidu himself does not understand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X