టికి ఒప్పుకోవడం మేలు: జగన్, ఫోన్లో సర్దిచెప్పే యత్నం

చిత్తూరు/హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు పైన అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టే కంటే విభజనకు అంగీకరించడం ఉత్తమమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. చర్చకు అంగీకరిస్తే విభజనకు అంగీకరించినట్లేనని, అలాంటప్పుడు చర్చకుంటే తెలంగాణకు అంగీకరించడమే మంచిదన్నారు. జగన్ సమైక్య శంఖారావం కమ్ ఓదార్పు యాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడులు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కిరణ్ సమైక్యమంటూ లోలోపల అధిష్టానం ఆదేశాలు పాటిస్తున్నారని, చంద్రబాబు కూడా ఢిల్లీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజలు సమైక్య రాష్ట్రాన్నే కోరుకుంటున్నారని చెప్పారు.

YS Jagan

ఎమ్మెల్యేలకు జగన్ ఫోన్

కాగా, సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చిత్తూరు జిల్లా యాత్రలో ఉన్న జగన్ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి మాట్లాడారు. ఆయన బుధవారం పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మతో సహా ముగ్గురు ఎమ్మెల్యేలతో మాట్లాడారు. తెలంగాణ బిల్లు పైన తీర్మానం, ఓటింగ్ తదితర అంశాలపై మాట్లాడారు.

పార్టీపై వస్తున్న విమర్శలతో పాటు, అన్ని పక్షాలు సభలో బిల్లుపై చర్చకు సానుకూలత వ్యక్తం చేస్తుండటం, సభలో ఓటింగ్ ద్వారా బిల్లును వ్యతిరేకించాలని సమైక్యవాదులు సూచిస్తున్న విషయమై వారు చర్చించారట. మనం సమైక్యానికి కట్టుబడి ఉన్నామని, ఎవరు కూడా విమర్శల ట్రాప్‌లో పడొద్దని, బిల్లుపై చర్చలో పాల్గొంటే విభజనకు అంగీకరించినట్లే అవుతుందని జగన్ వారికి సర్ది చెప్పాట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+