విజయవాడలో సెమీ క్రిస్మస్ వేడుకలు-కేక్ కట్ చేసిన జగన్-ముందస్తు శుభాకాంక్షలు..!
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవాళ సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారీ ఎత్తున క్రైస్తవులు ఈ వేడుకలకు హాజరయ్యారు. సెమీక్రిస్మస్ వేడుకలకు సీఎం వైయస్.జగన్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా క్రైస్తవ మతపెద్దలతో కలిసి ముఖ్యమంత్రి వైయస్.జగన్ కేక్ కట్ చేశారు.

ఇందిరాగాంధీ స్డేడియంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలకు జనం భారీగా తరలివచ్చారు. నగరానికి చెందిన క్రైస్తవులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా వచ్చారు. ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ మాట్లాడుతూ... క్రిస్మస్ వస్తున్న శుభసందర్భంలో ఈ సాయంత్రం పూట అడ్వాన్స్‌గా క్రిస్మస్‌ను జరుపుకుంటున్నామన్నారు. ఈ మంచి రోజులో ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలే కాకుండా మొత్తం తెలుగురాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ మీ అన్నగా, తమ్ముడిగా మెర్రీ క్రిస్‌మస్ ఇన్ అడ్వాన్స్ తెలియజేస్తున్నానన్నారు.

ఈ సందర్భంగా వేడుకల్లో పాల్గొన్న రెవరెండ్ రాజారావు సుదీర్ఘంగా దేవుని గురించి సందేశం ఇచ్చారు. దేవుని విషయంలో మనందరికీ కూడా తెలిసిన ఒక్కటే ఒక్క విషయం మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ చూపించడమన్నారు. ఆకాశమంత సహనం ప్రతి మనిషిలోనూ కూడా అలవాటు చేసుకోవడం, అవధులు లేని త్యాగం, మరీ ముఖ్యంగా శత్రువుల పట్ల కూడా క్షమాగుణం... ఇవన్నీ కష్టమైన విషయాలు అయినప్పటికీ ఆ ప్రతి విషయాన్ని మనం ఎప్పుడు గ్రహిస్తామో, ఎప్పుడైతే వాటిని మనసారా పాటించాలని తాపత్రయపడతామో... అప్పుడు మనం కూడా దేవుడు నచ్చిన బిడ్డలుగా ఉంటామన్నారు.

దేవుడు ఆ మనసు మనందరికీ ఇవ్వాలని, రాష్ట్రాన్ని, ప్రజలను దేవుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ ఉన్నవారితో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరికీ మరోక్కసారి మెర్రీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానన్నట్లు ఆయన తెలిపారు.

-
తెలుగు రాష్ట్రాల్లో ఈ టోల్ ప్లాజాల్లో ఫీజుల తగ్గింపు - కొత్త ధరలు, వీటికే వర్తింపు..!! -
Vijayawada: విజయవాడలో నాన్ వెజ్ బంద్-ఇవాళ రాత్రి నుంచే..! -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం!












Click it and Unblock the Notifications