కాంగ్రెస్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ విలీనం.. షర్మిలను బయటకు పంపేందుకు డీకేతో జగన్ మంతనాలు!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికలలో ఘోర ఓటమిపాలై 11సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుండి హుటాహుటిన బెంగళూరుకు ఎందుకు వెళ్ళారు అన్నది ఏపీలో చర్చిస్తున్నారు. టిడిపి కూటమి విజయం సాధించడంతో చంద్రబాబు మోడీల కూటమి తనను టార్గెట్ చేస్తుందని భావిస్తున్న వైయస్ జగన్ ఆసక్తికర రాజకీయానికి తెరలేపారని ప్రస్తుతం ఏపీలో చర్చ జరుగుతుంది.

డీకేతో జగన్ భేటీ.. వైసీపీని కాంగ్రెస్ లో విలీనం ప్లాన్
ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి సిద్ధమయ్యారని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలను తొలగిస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని ఆయన చెబుతున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీనికోసమే బెంగళూరు వేదికగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ తో నిన్న రాత్రి జగన్ భేటీ అయ్యారని ప్రచారం జరుగుతుంది.

YS Jagan plan to merge YSRCP in Congress Jagan talks with DK for sending out YS Sharmila

షర్మిలను టార్గెట్ చేసిన జగన్
కాంగ్రెస్ నుంచి షర్మిలను తొలగిస్తే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని డీకే ముందు ఆఫర్ పెట్టారని పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది. అయితే డీకే శివకుమార్ కాంగ్రెస్ హై కమాండ్ తో మాట్లాడిన తర్వాత నిర్ణయం చెబుతామని చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. ఇక ఇదే విషయాన్ని బిజెపి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిక్కులేని స్థితిలో తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. అధ్యక్ష పదవి నుండి తొలగిస్తే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో జగన్ చర్చలు జరిపారని బిజెపి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

జగన్ పరిస్థితిపై నల్లమిల్లి కామెంట్స్
జగన్ హడావుడిగా బెంగళూరు వెళ్లడం వెనక కారణం ఇదే అని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వకపోవడంతో వైఎస్ జగన్ పరిస్థితి దారుణంగా తయారైందని అందుకే ఆయన కాంగ్రెస్ లో వైసీపీ విలీనం చేసే ఆలోచనలో ఉన్నారని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+